సంగీత సురధార-5

1
2

[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాసపరంపర..]

అధ్యాయం 6 ద్వావింశంతి శృతులు – ప్రత్యేక నామములు – సాధారణ నామములు

ద్వావింశంతి శృతులు

క్రమ సంఖ్య జాతులు ద్వావింశంతి శృతులు  సాధారణ నామములు సంకేతము ద్వావింశంతి శృతులు  ప్రత్యేక

నామములు

ఆయా శృతులకు ఉదాహరణ రాగములు
1 1. షడ్జమము దీ తీవ్ర
256/243 2. రి1 ఏకశృతి రిషభము కుముద్వతి గౌళ
16/15 3. రి2 ద్విశృతి రిషభము మృ మన్ద మాయామాళవ గౌళ
10/4 4. రి3 త్రిశృతి రిషభము ఛందోవతి కాంభోజి, భైరవి
9/4 5. రి4 చతుశృతి రిషభము దయావతి కల్యాణి
32/27 6. శుద్ధ గాంధారము రంజని భైరవి, తోడి
6/5 7. గ2 సాధారణ గాంధారము మృ రతిక ఖరహరప్రియ
5/4 8. గ3 అం. గాంధారము దీ రౌద్రి శం. కాంభోజి
81/64 9. గ4 తీవ్ర (లేదా) చ్యుత గాంధారము క్రోధి కల్యాణి
4/3 10. మ1 శుద్ధ మధ్యమము దీ వజ్రిక
27/2 11. మ2 తీవ్ర మధ్యమము ప్రసారిణ బేగడ
45/32 or 1024/729 12. మ3 ప్రతి మధ్యమము మృ ప్రీతి పూర్వీ కల్యాణి
729/512 or 64/45 13. మ4 చ్యుత మధ్యమ పంచమము మార్జని మాళి, రామప్రియ
3/2 14. పంచమము మృ క్షితి
128/81 15. ద1 ఏకశృతి దైవతము రిక్త సావేరి
8/5 16. ద2 ద్విశృతి దైవతము సందీపిని మాయామాళవ గౌడ, తోడి
5/3 17. ద3 త్రిశృతి దైవతము ఆలాపిని కాంభోజి
27/6 18. ద4 చతుశృతి దైవతము మదంతి కల్యాణి
16/9 19. ని1 శుద్ధ నిషాదము రోహిణి కాంభోజి, భైరవి
9/5 20. ని2 కైశికి నిషాదము రమ్య ఖరహరప్రియ
15/8 21. ని3 కాకలి నిషాదము దీ ఉగ్ర శం. మాయామాళవ గౌడ,
243/128 22. ని4 చ్యుత షడ్జమము క్షాభిణి కల్యాణి, కురింజి

ద్వావింశంతి శృతులు గల పంచజాతులు

  1. దీప్తా – 5 జాతులు – 22 శృతలలో – 1, 8, 10, 21
  2. ఆయతా – 2,9, 11, 16, 19 – 5 స్వరములకు ఒక్కొక్క దానికి 4 (శృతులు మాత్రమే)
  3. కరుణా – 5, 17, 18 – 5 x 4 =20 + 1+1 (స, ప)
  4. మృదూ – 3, 7, 12, 14
  5. మధ్యా – 4, 6, 13, 15, 20, 22

శృతి అంతరములు (Music Intervals) – వాటి విలువలు

ఇవి ఆరు విధములు

1.ఏక శృతి అంతరము

ఇది మూడు విధములు.

(అ) ప్రమాణ ఏక శృతి – 81/80 – 22 సెంట్లు (ఆ) న్యూన ఏక శృతి – 25/24 – 70 సెంట్లు (ఇ) పూర్ణ ఏక శృతి – 256/243 – 90 సెంట్లు

[22 శృతులలో  7 పూర్ణ కును, 5 న్యూన కును, 10 ప్రమాణము నకు చెందియున్నవి]

2.ద్విశృతి అంతరము.

ఇది రెండు విధములు.

(అ) న్యూన ద్విశృతి – 135/128. (ఆ) పూర్ణ ద్విశృతి – 16/15.

3.త్రిశృతి అంతరము 10/9

4.చతుశృతి అంతరము – 9/8

5.పంచమశృతి అంరతము – 32/27

6.షట్ శృతి అంతరము – 6/5

22 శృతుల అంతరములు తెలుసుకును విధానము:

  • షడ్జమము 1 అనుకొనిన యడల
  • ఏకశృతి – 256/243
  • ద్విశృతి – 16/15
  • త్రిశృతి – 10/9
  • చతుశృతి – 9/8

అంతరములు అగును. ఇక్కడికి రిషభ అంతరములు పూర్తి అయినవి.

ఇక గాంధారమునకు చతుశృతి రిషభము (రి4) యొక్క విలువ ఆధారంగా శు॥ గా॥ సా॥ గా॥ అం॥ గా॥ చ్యుత మధ్య గా॥ విలువ కనుగొనవచ్చును. అదే విధంగా చ్యుత మధ్యమ గాంధారము యొక్క విలువను ఆధారముగా చేసుకొని శు॥ మ॥ తీవ్ర మ॥ ప్ర॥ మ॥ చ్యుత పంచమ మ॥ విలువలు కనుగొనవచ్చు.

ఇక పంచమ విలువ తెలుసుకొనుటకు రెండు పద్ధతులు కలవు

(అ) చ్యుత పంచమ మధ్యమము యొక్క విలువను పంచమము యొక్క విలువను గుణించుట ద్వారా

(ఆ) చ్యుత మధ్యమము గాంధారము యొక్క విలువను ఏక శృతి అంతరముతో గుణించట ద్వారా తెలుసుకొనవచ్చును.

పంచమము యొక్క విలువను ఆధారముగా చేసుకొని ఏక శృతి దై॥ ద్వి॥ త్రి॥ ద్వై॥ చ॥ దై॥ యొక్క విలువలను; చ॥ దై॥ యొక్క విలువను ఆధారముగా చేసుకుని శు॥ ని॥ కై॥ ని, కా ॥ ని॥ చ్యుత షడ్జ ని॥ యొక్క విలువలను తెలుసుకొనవచ్చును.

చ్యుత షడ్జ నిషాదమునకు ఏక శృతి అంతరముతో గుణించిన యెడల తార షడ్జమము యొక్క విలువ తెలియును (లేదా) చ॥ దై॥ పంచమ శృతి అంతరముతో గుణించిన యడల తార షడ్జమము యొక్క విలువ తెలియును.

  1. షడ్జమము -1 ఒకటి అనుకొనిన
  2. ఏకశృతి రిషభము = 1 x (256/243)=256/243
  3. ద్విశృతి రిషభము = 1 x (16/15)=16/15
  4. త్రిశృతి రిషభము = 1 x (10/9)=10/9
  5. చతుశృతి రిషభము = 1 x (9/8)=9/8
  6. శుద్ధ గాంధారము = (9/8) x (256/243)=32/27
  7. సాధారణ గాంధారము = (9/8) x (16/15)=6/5
  8. అంతర గాంధారము = (9/8) x (10/9)=5/4
  9. చ్యుత మధ్యమ = (9/8) x (9/8) = 81/64
  10. శుద్ధ మధ్యమ = (81/64) x (256/243) = 4/3
  11. తీవ్ర మధ్యమ = (81/64) x (16/15)=27/20
  12. ప్రతి మధ్యమ = (81/64) x (10/9)=45/32
  13. చ్యుత పంచమ మధ్యమము = (81/64) x (9/8) = 729/512
  14. పంచమము = (81/64) x (32/27)=3/2 (0r) (729/512) x (256/243)=3/2
  15. ఏకశృతి దైవతము = (3/2) x (256/243)=128/81
  16. ద్విశృతి దైవతము = (3/2) x (16/15)=8/5
  17. త్రిశృతి దైవతము = (3/2) x (10/9)=5/3
  18. చతుశృతి దైవతము =(3/2) x (9/8) = 27/16
  19. శుద్ధ నిషాదము = (27/16) x (256/243) = 16/9
  20. కైశికి నిషాదము = (27/16) x (16/15)=9/5
  21. కాకలి నిషాదము = (27/16) x (10/9)=15/8
  22. చ్యుత షడ్జ నిషాదము = (27/16) x (9/8) = 243/128

మధ్య మిగిలిన ఏ అంతరమున్నను అవి అనురాది స్వరములగును. 13 శృతి అంతరములున్నచో రెండు స్వరములలో దిగువ స్వరము షడ్జ అయిన, పై స్వరము పంచమమే. అట్లే 9 శృత్యంతరములుండిన రెండు స్వరములలో దిగువ స్వరము షడ్జ అయినచో, పై స్వరము శుద్ధ  మధ్యమము. షడ్జ పంచమ భావములోను, షడ్జ మధ్యమ భావన్ములో గల ఏ రెండు స్వరములైనను, ఒకదానికొకటి సంవాదులే. మన స్థాయి యందు ఒక పంచమ భావమును, మధ్యమ భావము కలదు. షడ్జము నుండి పంచమ భావము. ఆ పంచమము నుండి తారాస్థాయి షడ్జము వరకు షడ్జ మధ్యమ భావము.

స – ప; ప – స= స. మ. 13+9=22

నియత శృతులు:

  • షడ్జము – ఛందోవతి – 4వ శృతి
  • రిషభము – రతిక – 7వ శృతి
  • గాంధారము – క్రోధ – 9వ శృతి
  • మధ్యమము – మార్జని – 13వ శృతి
  • పంచమము – ఆలాపిని – 17వ శృతి
  • దైవతము – రమ్య – 20వ శృతి
  • నిషాదము – క్షోభిణి – 22వ శృతి

ప్రాచీన శుద్ధ స్వరములు కూడా ఇవియే. ఈ శుద్ధ స్వరములను అనుసరించిన విధమున దానికి పైనను, దిగువను, కన్పించిన స్వరములు వికృత స్వరములైనవి.

ఏదేని రెండు స్వరములలో తక్కువ, శృతులు పలికెడి స్వరమును షడ్జముగా అనుకొనిన పక్షమున, పై స్వరము దాని యొక్క సరియైన పంచమముగా పలికినచో అవి రెండును షడ్జ పంచమ భావములలో నుండినట్లు అర్థము (స-ప; రి-ద; గ-ని; మ-స).

ఇవి షడ్జ పంచమ భావములో ఉన్న జతలు. ఏదేనీ రెండు స్వరములలో క్రింది స్వరమును షడ్జమముగా అనుకొని, పై స్వరమును దానియొక్క సరియైన శుద్ధ మధ్యమముగా పలికినచో, అవి రెండును షడ్జ మధ్యమ భావములో నుండినట్లు అర్థము చేసుకొనవలెను. స.మ; రి.ప; గ.ద; మ.ని; ప.స – ఇవి షడ్జ మధ్యమ భావ జతలు.

షడ్జ పంచమ భావములో వచ్చు శృతులు:

  • షడ్జము విలువ=1
  • పంచమము విలువ = 3/2
  • చ. రిషభము విలువ = 9/8
  • చ. దైవతము విలువ = 27/16
  • తీవ్ర అం॥ గాం॥ విలువ = 81/64
  • తీవ్ర కా॥ ని విలువ = 243/128
  • తీవ్ర ప్రతి మధ్యమము విలువ = 729/512
  • ద్విశృతి రిషభము విలువ = 16/15
  • ద్విశృతి దైవతము విలువ = 8/5
  • సాధారణ గాంధారము విలువ = 6/5
  • కై॥ ని॥ విలువ = 9/5
  • తీవ్ర శుద్ధ మధ్యమము విలువ = 27/20

షడ్చ, మధ్యమ భావములో వచ్చు శృతులు:

  • షడ్జము =1
  • శుద్ధ మధ్యమము = 4/3
  • కోమల కై॥ ని॥ = 16/9
  • కోమల సా॥ గాం॥ = 32/27
  • ఏకశృతి దైవతము = 128/81
  • ఏకశృతి రిషభము = 256/243
  • ప్రతి మధ్యమము = 1024/729 or 45/32
  • కాకలి నిషాదము = 15/8
  • అంతర గాంధారము = 5/4
  • త్రిశృతి దైవతము = 5/3
  • త్రిశృతి రిషభము = 10/9

షడ్జ పంచమ భావములో షడ్జముతో సహా 12, షడ్జ మధ్య భావములో షడ్జముతో సహా 11 శృతులు కలుగును.

స్వరముల అంతరములు తెలుసుకొనుట:

(అ) శృతిలో హెచ్చుగా పలుకు స్వర విలువను తక్కువగా పలుకు స్వర విలువ చేత విభజించిన యెడల ఆ స్వరము అంతరము తెలియును.

(ఆ) అట్లే శృతిలో తక్కువ పలుకు స్వరముల విలువను శృత్యంతరముతో గుణించిన పైనున్న స్వరము విలువ లభించును.

(L x I=H) (H/I=L)

H=శృతిలో హెచ్చుగా పలుకునట్తి స్వరము

L=శృతిలో తక్కువగా పల్కునది.

H/I=L అను సూత్రమును గ్రహింప వలెను.

(I= Interval)

ఏకశృత్యంతరములు మూడు:

  • పూర్ణ శృతి – 256/243
  • న్యూన శృతి – 25/24
  • ప్రమాణ శృతి – 81/80

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here