Site icon Sanchika

సంగీత సురధార-50

[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాస పరంపర..]

అధ్యాయం 33 – రెండవ భాగం

వాతావరణ ప్రభావం:

  1. చల్ల ప్రదేశాలలో ఉండి flute కచ్చేరీలు చేసేవారు సభకు 15 నిమిషాల ముందే వస్తారు.
  2. పగటిపూటే సాధన చేస్తారు. Hot countries లో రాత్రి, ఉదయం చేస్తారు.
  3. యూరోపియన్ దేశాలలో ఎక్కువ గంటలు సాధన చేస్తారు. భారతీయ విద్వాంసుల కన్నా ఎక్కువగా.
  4. Pitch of Voice తగ్గుతూ వస్తుంది.
  5. చల్లని దేశాలలో వీణ తంత్రి శ్రుతి ఎక్కువ. తరచుగా శ్రుతి చేస్తారు. భారతదేశంలో hot Sun లో శ్రుతి చేస్తారు.
  6. ఇండియాలో Dance, Drama, Open Air లో చేస్తారు. కానీ చల్లని ప్రదేశాల్లో అలా కుదరదు. జానపద సంగీతం, పండగలు, open air లో చేస్తారు.
  7. Double walled, Sound proof chambers India లో తక్కువ.
  8. Tropical countries – women high pitch notes easy గా పాడతారు.

Breaking of the Voice:

బాలురకి 16 ఏళ్ళు దాటాకా voice crack వస్తుంది. Adult voice set అవడానికి transition period అది వారికి.

ఇతరములు:

Season – Timings – Day and Night రాగాలు కూడా ఉన్నాయి. గాన కళా నియమము 6 ఋతువులు, 2 months each, in a year and 6 primary ragas. శ్రీ, వసంత, భైరవ, పంచమ, మేఘ, నట నారాయణ, – ఇవి 6 seasons – వసంత, గ్రీష్మ, వర్ష, శరద్, హేమంత, శిశిర ఋతువులకు అన్వయించబడతాయి.

సంగీతం ఉపయోగాలు:

  1. Military Band: సైనికులలో ఉద్రేకాన్ని (emotion), ధైర్యాన్ని (heroic) నింపుతుంది.
  2. Flute Music: గొర్రెలు అన్నీ గుంపులుగా వచ్చి చేరుతాయి.
  3. Snake Music: పాములు పుట్టల లోంచి బయటకు వచ్చేటట్లు చేస్తుంది.
  4. Medieval Period లో navbat perform చేస్తారు. అప్పుడు ప్రజలకి టైమ్ తెలిసేది.
  5. భేరీ మోగించటం వల్ల దూరంలో ఉన్న దొంగలు, దోపిడీదారులను పట్టుకొనుటకు గ్రామ ప్రజలు గుమిగూడి ఉంటారు (కర్రలతో, కత్తులతో, ఇతర ఆయుధాలతో తయారుగా ఉంటారు)
  6. Africans కి drum language వుంది. దాని ద్వారా వారు కొన్ని మైళ్ళ దూరంలో వున్న ప్రజలకి వార్తలు పంపగలరు.
  7. Europe లో musical code ఉంది. అటువంటిదే ఇండియాలో కూడా ఉంది.
  8. శంఖారావములు, (horns) భారతీయ గ్రామాలలో అధికారులను స్వాగతించేటప్పుడు వాడతారు.
  9. Single faced Drum గుడిలో జరిగే ఉత్సవాలలో వాడతారు.

సంగీతం వల్ల లాభాలు ఏమిటి?

సంగీతాన్ని వినడానికి గాని, పాడడానికి గాని, వాయిద్యం వాయించడానికి గాని ఇష్టపడని వారు సాధారణంగా ఉండరు. సంగీతం ప్రతీ పాఠశాలలో ఒక భాగముగా పొందుపరుస్తున్నారు. సంగీత శిక్షణతో ఒక క్రమశిక్షణ అలవడుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చాలా లాభాలలో కొన్ని విపులీకరించుకుందాం.

ఇలా ఎన్నో రకాల ప్రయోజనాలు, లాభాలు సంగీతం వలన కలుగుతాయి. సంగీతం విన్నా, నేర్చుకున్నా వచ్చే మంచి ఆలోచనలు పిల్లలను భావి పౌరులుగా తీర్చిదిద్దుతాయి.

(సమాప్తం)

Exit mobile version