Site icon Sanchika

సంగీత సురధార-6

[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాసపరంపర..]

అధ్యాయం 7 స్థాయి యందు గల పూర్ణ శ్రుతులు – భరతుని ధ్రువ చలవీణలు

స్థాయి యందు గల పూర్ణ శ్రుతులు

  1. షజ్డము, ఏక శ్రుతి రిషభములకు మధ్య అంతరం – పూర్ణ శ్రుతి అంతరం.
  2. చతుశ్రుతి రిషభ, కోమల సాధారణ గాంధారముల మధ్య గల అంతరం – పూర్ణ శ్రుతి.
  3. తీవ్ర అంతర గాంధార, శుద్ధ మధ్యమముల మధ్య గల అంతరము – పూర్ణ శ్రుతి.
  4. తీవ్ర ప్రతి మధ్యమ, పంచమములకు మధ్య గల అంతరము – పూర్ణ శ్రుతి.
  5. పంచమము, ఏక శ్రుతి దైవతములకు మధ్య గల అంతరం – పూర్ణ శ్రుతి.
  6. చతుశ్రుతి దైవత, కోమల కైశికి నిషాదములకు మధ్య గల అంతరము – పూర్ణ శ్రుతి.
  7. తీవ్ర కాకలి నిషాద, షడ్జములకు మధ్య గల అంతరము – పూర్ణ శ్రుతి.

న్యూన శ్రుతులు:

ఒక్కొక్క స్వరమునకు గల 4 శ్రుతులలో రెండవ శ్రుతికిని, మూడవ శ్రుతికిని మధ్య గల అంతరము న్యూన శ్రుత్యంతరము. ఒక స్థాయి యందు 5 న్యూన శ్రుత్యంతరములు గలవు.

  1. ద్విశ్రుతి, త్రిశ్రుతి రిషభములకు మధ్య గల అంతరం.
  2. సాధారణ, అంతర గాంధారములకు మధ్య గల అంతరము.
  3. తీవ్ర శుద్ధ మధ్యమ, ప్రతి మధ్యలకు మధ్య గల అంతరము.
  4. ద్విశ్రుతి, త్రిశ్రుతి దైవతములకు మధ్య గల అంతరము.
  5. కైశికి, కాకలి నిషాదములకు మధ్య గల అంతరము.

ప్రమాణ శ్రుతి అంతరములు:

ఒక్కొక్క స్వరస్థానములో జత శ్రుతులలో ప్రతి రెండింటికి మధ్య గల అంతరము. మొత్తము=10.

  1. ఏక శ్రుతి, ద్విశ్రుతి రిషభముల మధ్య ప్రమాణ శ్రుతి అంతరము.
  2. త్రిశ్రుతి, చతుశ్రుతి రిషభముల మధ్య ప్రమాణ శ్రుతి అంతరము.
  3. కోమల సాధారణ, సాధారణ గాంధారముల మధ్య ప్రమాణ శ్రుతి అంతరము.
  4. అంతర గాంధార, తీవ్ర అంతర గాంధారముల మధ్య ప్రమాణ శ్రుతి అంతరము.
  5. శుద్ధ మధ్యమ, తీవ్ర శుద్ధ మధ్యమముల మధ్య ప్రమాణ శ్రుతి అంతరము.
  6. ప్రతి మధ్యమ, తీవ్ర ప్రతి మధ్యమముల మధ్య ప్రమాణ శ్రుతి అంతరము.
  7. ఏక శ్రుతి ద్విశ్రుతి దైవతముల మధ్య ప్రమాణ శ్రుతి అంతరము.
  8. త్రిశ్రుతి చతుశ్రుతి దైవతముల మధ్య ప్రమాణ శ్రుతి అంతరము.
  9. కోమల కైశికి నిషాదమ్ కైశికి నిషాదముల మధ్య ప్రమాణ శ్రుతి అంతరము.
  10. కాకలి, తీవ్ర కాకలి నిషాదముల మధ్య ప్రమాణ శ్రుతి అంతరము.

స్థాయిలో గల 22 శ్రుతుల అమరికలో గల ప్రమాణ శ్రుతులు 5 న్యూన శ్రుతులు, 7 పూర్ణ శ్రుతులు కలిసి స్థాయి యొక్క విలువకు సమానమగును. పై శ్రుతులన్నింటిని గుణించిన స్థాయి యొక్క విలువ 2 వచ్చును.

ఏక శ్రుత్యంతరము యొక్క అంతరములు భరతముని జరిపిన ధ్రువ, చలవీణల పరిశోధనల ఫలితముగా వచ్చినది.

వారు పంచమము నుండి ఒక్కొక్క శ్రుతిని తగ్గించుకుని, మధ్యమము వరకు దిగి వచ్చిన సందర్భములో మొదటి ఘట్టములో ప్రమాణశ్రుతి 2వ పూర్ణశ్రుతి. 3లో న్యూనశ్రుతి కన్పించెను.

***

భరతుని ధ్రువ చలవీణలు:

వేదకాలము నుండియు రెండు విధములైన వీణలు సంగీత ప్రపంచమున వాడుకలో వున్నవి.

  1. మెట్లతో వుండి ప్రస్తుతం వాడుకలో వున్న వీణ.
  2. మెట్లు లేకుండా అనేకమైన తీగలతో ప్రస్తుత స్వరమండలికి సరిపోవునట్టిది.

వీణలు సంగీత కచేరికి కాకుండా సంగీత అభివృద్ధికి చాలా ఉపయోగపడ్డాయి. ఈ వీణలతో లాక్షణీకులు పరిశోధనలు జరిపి సంగీత అభివృద్ధికి దోహదం చేశారు. రెండు వీణలకు తీగలు ఈ విధంగా కలవు.

ధ్రువవీణను స్థిరముగా పెట్టుకుని, చలవీణ తీగలను మారుస్తూ సూక్ష్మమైన శ్రుతి అంతరము కనుగొనుటయే భరతుడు చేసిన పరిశోధన.

సామగాన scale చేసినప్పుడు

చలవీణలో ఉండే 17వ తీగ (పంచమమును) తగ్గించెను. పంచమమునకు, చ్యుత పంచమమమునకు మధ్య గల తేడా ఒక అంతరము. అది ప్రమాణ శ్రుతి = 81/80 value.

మధ్యమ గ్రామము (40/27) x (81/80) = 3/2

భరతుని ఉద్దేశము:

  1. ఏక శ్రుత్యంతరములు ఎన్ని ఉన్నాయి – 3 ఏక శ్రుతి పరిణామాలు
  2. మధ్యమ గ్రామమును నిర్ణయించుట
  3. షడ్జ గ్రామములలో స, ప, మధ్యమ గ్రామాలలో రి, మ – సంవాదులు అన్న విషయము
  4. చలవీణలో పంచమమును తగ్గించుట. రి,గ – ద, ని – సమశ్రుతులు.

భరతుడు ధ్రువ, చలవీణలకు 7 తంత్రులే బిగించెను. సారంగదేవులు -22 తీగెలు పెట్టెను.

(ఇంకా ఉంది)

Exit mobile version