Site icon Sanchika

సంగీత సురధార-7

[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాసపరంపర..]

అధ్యాయం 8 గ్రామ మూర్ఛన జాతి పద్ధతి, ప్రాచీన రాగ పద్ధతి

[dropcap]భా[/dropcap]రతీయ సంగీతమునకు అతి ప్రాచీనమైన చరిత్ర ఉందనుటకు ఆధారములు గలవు.

సామవేదములో ఉచ్చరించపబడు స్వరములే భారతీయ సంగీతమునకు ఆధారములయినవని మనకు లక్షణకారుల వలన తెలియును. ఇప్పటి ఖరహరప్రియ లోని స్వరములే అప్పటి ఆది మేళము. ఇప్పటి రాగపద్ధతి అభివృద్ధి గాని, ఆ కాలములో షడ్జమము నుండి నిషాదము వరకు గల ఖరహరప్రియ స్వరములే మొట్టమొదటి మూర్ఛన.  ఆ మూర్ఛనలో రిషభము మేళము వచ్చినది. ఇట్లే గాంధారము వద్ద, మధ్యమము వద్ద, పంచమ, దైవత, నిషాదముల వద్ద కూడా మూర్ఛనలు ఉత్పన్నమైనవి.

ఇట్లు పైన చెప్పిన ఆది మేళములో షడ్జ మూర్ఛనతో పాటు మరొక ఆరు మూర్ఛనలు వచ్చుట వలన మొత్తము 7 మూర్ఛనలను కలిపి ఒక ‘గ్రామము’ లేక ‘మండలము’ అనిరి. దీనినే ‘షడ్జ గ్రామము’ అందురు. తర్వాత రిషభము వద్ద వచ్చిన మూర్ఛనను ఆధారము చేసికొని తిరిగి పై విధముగానే ప్రస్తరించగా మరొక గ్రామము (రిషభ గ్రామము) ఉద్భవించినది. ఇట్లే గాంధార గ్రామము, మధ్యమ గ్రామము మొదలగునవి ఉత్పన్నమైనవని చెప్పుదురు. కాని అందుకొన్ని శ్రావ్యముగాను, ఆచరణ యోగ్యముగను యుండకపోవుటచే తక్కినవన్నియు విసర్జించి షడ్జ గ్రామము, గాంధార గ్రామము, మధ్యమ గ్రామములను మాత్రమే పేర్కొనిరి.

పై విధముగా 3 గ్రామములతో కలిపి (3 x 7) 21 మూర్ఛనలు ఉద్భవించినవి. ఈ మూర్ఛనలనే అలంకారముల వలె నుండి స్వర సమూహములతో పాడి వాటినే ‘జాతులు’ అని పేర్కొనిరి. ఒక విధముగా చెప్పవలెనన్న అప్పటి జాతులే నేటి గమక యుక్తమైన రాగములైనవి.

షడ్జ గ్రామము గాంధార గ్రామము మధ్యమ గ్రామము
స రి గ మ ప ద ని గ మ ప ద ని స రి మ ప ద ని స రి గ
రి గ మ ప ద ని స మ ప ద ని స రి గ ప ద ని స రి గ మ
గ మ ప ద ని స రి ప ద ని స రి గ మ ద ని స రి గ మ ప
మ ప ద ని స రి గ ద ని స రి గ మ ప ని స రి గ మ ప ద
ప ద ని స రి గ మ ని స రి గ మ ప ద స రి గ మ ప ద ని
ద ని స రి గ మ ప స రి గ మ ప ద ని రి గ మ ప ద ని స
ని స రి గ మ ప ద రి గ మ ప ద ని స గ మ ప ద ని స రి

(ఇంకా ఉంది)

Exit mobile version