Site icon Sanchika

సంగీత సురధార-8

[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాసపరంపర..]

అధ్యాయం 9 – మొదటి భాగము

తాళాంగములు – పంచ లఘు జాతులు

సప్త తాళముల పేర్లు – వాని అంగములు – 35 తాళములు

[dropcap]రా[/dropcap]గము, తాళము కర్ణాటక సంగీతమునకు ప్రాణముల వంటివి. కర్ణాటక సంగీత ప్రపంచములో ‘తాళ ప్రకరణం’ చాలా ముఖ్యమైనది. మన సంగీతములో గల పలు విధములైన తాళములు మరి యే సంగీతములోనూ లేవు.

తాళము అనునది సంగీతమును కొలుచు కొలబద్ద వంటిదని చెప్పవచ్చును. కర్ణాటక సంగీతములో తాళములు ముఖ్యముగా ఏడు కలవు.

సప్త తాళములు:

  1. ధృవ తాళము- I O I I
  2. మఠ్య తాళము – I O I
  3. రూపక తాళము- O I
  4. ఝంపె తాళము- I U O
  5. త్రిపుట తాళము – I OO
  6. ఆట తాళము- I I O O
  7. ఏక తాళము – I

తాళాంగములు:

కొన్ని అంగములు పలు విధములుగా కూర్చుట వలన పై తాళములు ఏర్పడినవి. వీనినే ‘తాళాంగములు’ అందురు. తాళాంగము అనగా తాళము యొక్క  భాగము.

ఈ తాళాంగములు ఆరు కలవు. వాటిలో 1. ఒక లఘువు (I) 2.ద్రుతము (O) 3. అనుద్రుతము (U) ముఖ్యమైనవి. ఈ మూడు అంగములను రకరకములుగా కూర్చుట వలననే పై 7 తాళములు ఏర్పడినవి.

పంచ జాతులు:

జాతి అనునది తాళములో లఘువుకు సంబంధించినది. అనగా జాతిని బట్టి లఘువులో నుండు క్రియల సంఖ్య మార్పు చెందును. జాతులు అయిదు విధములు.

  1. త్రిశ్ర జాతి: లఘువునకు 3 క్రియలు
  2. చతురస్ర జాతి: లఘువునకు 4 క్రియలు
  3. ఖండ జాతి: లఘువునకు 5 క్రియలు
  4. మిశ్ర జాతి: లఘువునకు 7 క్రియలు
  5. సంకీర్ణ జాతి: లఘువునకు 9 క్రియలు

35 తాళముల పేర్లు – మొత్తం సంఖ్య:

జాతి నామము సంకేతములు క్రియలు మొత్తం
1 త్రిశ్ర ధృవ తాళము I O I I 3+2+3+3 11
2 త్రిశ్ర మధ్య తాళము I O I 3+2+3 8
3 త్రిశ్ర రూపక తాళము O I 2+3 5
4 త్రిశ్ర ఝంపె తాళము I U O 3+1+2 6
5 త్రిశ్ర త్రిపుట తాళము I O O 3+2+2 7
6 త్రిశ్ర ఆట తాళము I I O O 3+3+2+2 10
7 త్రిశ్ర ఏక తాళము I 3 3
8 చతురస్ర ధృవ తాళము I O I I 4+2+4+4 14
9 చతురస్ర మధ్య తాళము I O I 4+2+4 10
10 చతురస్ర రూపక తాళము O I 2+4 6
11 చతురస్ర ఝంపె తాళము I U O 4+1+2 7
12 చతురస్ర త్రిపుట తాళము I O O 4+2+2 8
13 చతురస్ర ఆట తాళము I I O O 4+4+2+2 12
14 చతురస్ర ఏక తాళము I 4 4
15 ఖండ ధృవ తాళము I O I I 5+2+5+5 17
16 ఖండ మధ్య తాళము I O I 5+2+5 12
17 ఖండ రూపక తాళము O I 2+5 7
18 ఖండ ఝంపె తాళము I U O 5+1+2 8
19 ఖండ త్రిపుట తాళము I O O 5+2+2 9
20 ఖండ ఆట తాళము I I O O 5+5+2+2 14
21 ఖండ ఏక తాళము I 5 5
22 మిశ్ర ధృవ తాళము I O I I 7+2+7+7 23
23 మిశ్ర మధ్య తాళము I O I 7+2+7 16
24 మిశ్ర రూపక తాళము O I 2+7 9
25 మిశ్ర ఝంపె తాళము I U O 7+1+2 10
26 మిశ్ర త్రిపుట తాళము I O O 7+2+2 11
27 మిశ్ర ఆట తాళము I I O O 7+7+2+2 18
28 మిశ్ర ఏక తాళము I 7 7
29 సంకీర్ణ ధృవ తాళము I O I I 9+2+9+9 29
30 సంకీర్ణ మధ్య తాళము I O I 9+2+9 20
31 సంకీర్ణ రూపక తాళము O I 2+9 11
32 సంకీర్ణ ఝంపె తాళము I U O 9+1+2 12
33 సంకీర్ణ త్రిపుట తాళము I O O 9+2+2 13
34 సంకీర్ణ ఆట తాళము I I O O 9+9+2+2 22
35 సంకీర్ణ ఏక తాళము I 9 9

 (ఇంకా ఉంది)

Exit mobile version