Site icon Sanchika

మనల్ని మనం సంస్కరించుకోవాలనిపించే కథలు – సంకెళ్ళు

[dropcap]మం[/dropcap]జరి రచించిన 10 కథలు, 6 పుస్తక పరిచయ వ్యాసాల సంకలనం ‘సంకెళ్ళు’ పుస్తకం.  మంజరి రచనల్లో మానవీయత, కుటుంబ సంబంధాలు, వృత్తిలో నిజాయితీ, క్రమశిక్షణ స్పష్టంగా కనిపిస్తాయి. అవి మనలను ఆచరింపజేస్తాయి. మనలను మనం సంస్కరించుకోవాలనిపించేలా చేస్తాయి. కథా ప్రయోజనం నెరవేరుతుందని ఎన్.కె.బాబు పబ్లిషర్ నోట్‌లో రాశారు.

“మంజరి గారిలో విశిష్టత ఎలాంటి డొంక తిరుగుడు లేకుండా సూటిగా చెప్పగలగడం, పదాడంబరాలు లేకుండా వాడుక భాషలో రాయడం. నేల విడిచి సాము చెయ్యని పాత్రలు సృష్టించడం, మానవ సంబంధాల్ని ఉన్నతంగా చూపించడం” అని ప్రఖ్యాత రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి ముందుమాటలో రాశారు. ఈ సంకలనంలో 10 కథలతో పాటు, ‘మిస్టీరియస్ స్ట్రేంజర్’, ‘కాల్ ఆఫ్ ది వైల్డ్’, ‘ది ప్రిన్స్ అండ్ ది పాపర్’, ‘హిజ్ నేమ్ వజ్ నాట్ లిస్టెడ్’, ‘యమ: ది పిట్’, ‘డైరీ ఆఫ్ ఎ క్రిమినాలజిస్ట్’ వంటి రచనల పరిచయ వ్యాసాలున్నాయి.

సంకెళ్ళు

పేజీలు: 110

రూ. 120/-

ప్రతులకు: అన్ని ప్రధాన పుస్తక విక్రయ కేంద్రాలు.

Exit mobile version