Site icon Sanchika

సంస్కృత శ్లోకాలు – తెలుగు పద్యాలు 12

[box type=’note’ fontsize=’16’] సంస్కృత శ్లోకాలను తెలుగు పద్యాలుగా అనువదించడమే పుప్పాల జగన్మోహన్రావు ప్రత్యేకత. కొన్ని ఎంపిక చేసిన సంస్కృత శ్లోకాలను సరళమైన తెలుగులో పద్యరూపంలో అందిస్తున్నారు. [/box]

కావ్య శాస్త్ర వినోదేన
కాలో గచ్ఛతి ధీమతాం ।
వ్యసనేన చ మూర్ఖాణాం
నిద్రయా క‌లహేన వా॥

ఆటవెలది
కావ్య శాస్త్ర చర్చ ఘనముగా జేయుచు
బుద్ధి మంతు లెపుడు సిద్ధి నొంద
వసుధ నిదుర యందు వ్యసనాల కలహాల
కాల మెల్ల జడులు గడుపు చుంద్రు ౫౬

***

యస్మిన్ జీవతి జీవంతి
బహవః స తు జీవతు ।
కాకోపి కిం న కురుతే
చంచ్వా స్వోదర పూరణమ్ ॥

తేటగీతి
ఎవడు జీవించ జగమెల్ల ఎలమి నుండు
నతడె జగమందు జీవించ నర్హు డయ్య
కడుపు నింపుకు సతతమ్ము కాకి వోలె
ఎంత కాలము జీవించ నేమి ఫలము ? ౫౭

***

దూరస్థోఽపి న దూరస్థో
యో యస్య మనసి స్థితః ।
యో యస్య హృదయే నాస్తి
సమీపస్థోఽపి దూరతః ॥

ఆటవెలది
ఎంత దూర మైన ఎదనుజేరిన వాని
చెంత నున్న సరణి చెప్ప వచ్చు
ఎంత చెంత నున్న ఎదను జేరని వాని
చెంత లేని యటులె చెప్ప వచ్చు ౫౮

***

యథా ఖాత్వా ఖనిత్రేణ
భూతలే వారి విందంతి ।
తథా గురుగతాం విద్యాం
శుశ్రూషు రధిగచ్ఛతి ॥

ఆటవెలది
పలుగు బట్టి భువిని పలుమార్లు త్రవ్వంగ
భద్ర జలము లన్ని బయట పడవె
అటులె విద్య లన్ని అరసి నేర్వగ వచ్చు
శిష్య గణము గురుని సేవ జేసి ౫౯

***

ద్విజిహ్వో మానవః క్రూరః
ద్విజిహ్వోదపి పన్నగాత్ ।
సర్పో హరత్యేకమేవ
క్రూరస్తు కుల నాశకః ॥

ఆటవెలది
రెండు నాల్క లున్న దండి మానవుకన్న
నయమె సుమ్మి రెండు నాల్కల ఫణి
కాటు వేసెడి ఫణి కడతేర్చు నొకనినె
క్రూరు డొకడె చెఱచు కులము నంత ౬౦

Exit mobile version