Site icon Sanchika

సరిగ పదమని-1

[dropcap]’స[/dropcap]రిగ పదమని’ (మన రెక్కలు) అనే శీర్షికతో సంచిక పాఠకులకు వారం వారం రెక్కలని అందిస్తున్నారు పురాణం శ్రీనివాస శాస్త్రి.

ఓం నమహాలు
ఓనమాలు
విజయవాడ
బెజవాడ

పలుకు’బడి’లో
అక్షరాభ్యాసం.

***

కాలాన్ని ఖజానాలో
బంధించాలని తహ తహ…
వెలుగుని చీకట్లో
పాతేయాలని యావ

అలవికాని ఆశలు
ఎప్పటికీ సశేషాలు!

***

ప్రవాహంలో పడి
కొట్టుకుపోవడం కాదు
నువ్వే ఓ ప్రవాహం
ఆపదల ఎదురీతతో

జడి, వడి ఉరవడి
నీ అడుగుల వెంబడి.

***

లోకం ఎప్పటికీ
ఇలాగే ఉంటుందని
చేసే సూత్రీకరణలు
కొట్టుకుపోవడం ఖాయం!

రాకాసి చెట్టుకు
తుఫాను గండం!!

Exit mobile version