Site icon Sanchika

సరిగ పదమని-14

[dropcap]’స[/dropcap]రిగ పదమని’ (మన రెక్కలు) అనే శీర్షికతో సంచిక పాఠకులకు రెక్కలని అందిస్తున్నారు పురాణం శ్రీనివాస శాస్త్రి.

~ ~

దేముడు చెప్పినా
రాముడు చెప్పినా
ఆరుద్ర చెప్పినా
ఆదిరుద్రుడు చెప్పినా

మానవుడే మహనీయుడు!
అతగాడే మాననీయుడు!

~ ~

వర్షానికి బెదిరి
పక్షులన్నీ చెదురు –
గెద్ద మాత్రం మేఘం
దిశగానే ఎగురు –

కష్టంలో గెలుపు వైపు
ఇష్టంగా విజేత చూపు!
(అబ్దుల్ కలాం సూక్తి)

~ ~

సుడిగాలి గోలలో
గాలిపటం గెంతులు –
కల్లోల సంద్రంలో
కెరటం తుళ్లింతలు –

ఖేదంలో మోదం
మన జీవన వేదం!

~ ~

ఛాలంజ్ విసిరినవాడు
నీ పరోక్ష మిత్రుడు –
స్వీకరిస్తే సవాలు
గెలుపుకెంతో వీలు –

ఎదురొడ్డితేనే
ఎదురుగాలి బెంబేలు!
Exit mobile version