సరిగ పదమని-17

0
4

[dropcap]’స[/dropcap]రిగ పదమని’ (మన రెక్కలు) అనే శీర్షికతో సంచిక పాఠకులకు రెక్కలని అందిస్తున్నారు పురాణం శ్రీనివాస శాస్త్రి.

~ ~

స్వతంత్రతా గృహిణి
శ్రద్ధగా పెట్టిన
ఊరగాయలు
పిఎస్‌యులు!

సర్కారు జరూరు…
క్రోనీ విందుకు జుర్రేరు!

~ ~

దైవం ఎదురైతే
పక్కకి తప్పుకొని
మనిషి ఎదురువస్తే
చేతులు చాపుతాను!

దేముడి కోసం భక్తలోకం
మనిషికి మనిషే నమ్మకం!

~ ~

కాశపు ఎత్తుల్లో
సముద్రపు లోతుల్లో
మంచు లోయల్లో
పర్వత పాషాణాల్లో

ఎల్లెడలా వింత జివుల
సంతలు… పుంతలు!

~ ~

తాటి తోపులు
పూల పొదలు
కొండ గుట్టలు
ఇసుక ఎడారులు

ఎటు చూస్తే అటు
దాగని సృష్టి నిజాలు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here