Site icon Sanchika

సరిగ పదమని-20

[dropcap]’స[/dropcap]రిగ పదమని’ (మన రెక్కలు) అనే శీర్షికతో సంచిక పాఠకులకు రెక్కలని అందిస్తున్నారు పురాణం శ్రీనివాస శాస్త్రి.

~ ~

కాకర
ఓ కూర వీర!
రుచుల్లో బూచి –
ఆరోగ్య కాణాచి!

తినాలి మరి
చేదు మరచి!

~ ~

నుదుట బొట్టు
భుజంపై శాలువా..
పంచె గూడ కట్టు..
లాల్చీ మీద కండువా!

‘టోపీ’ కొత్త రూపం –
మోసం మార్చింది వేషం!

~ ~

సమర్థుడు తప్పు
అంటే
ఉడకదు
పప్పు –

అసమర్థుడి ఒప్పు –
మోగదు సుమా డప్పు!

~ ~

అబద్ధానిదే
అందం –
బంతి పూవు
చందం!

పూజకు పనికిరాదు..
ఫలితం పరమ చేదు!
Exit mobile version