సరిగ పదమని-24

0
2

[dropcap]’స[/dropcap]రిగ పదమని’ (మన రెక్కలు) అనే శీర్షికతో సంచిక పాఠకులకు రెక్కలని అందిస్తున్నారు పురాణం శ్రీనివాస శాస్త్రి.

~ ~

గెద్ద నుంచి
చీమ దాకా
ప్రాణులన్నీ
సృష్టి కేతనాలు –

మధ్యలో మనిషే
హింస నచణా ధురీణ!

~ ~

పంటల కోసం
సాగునీటి తండాలు
వెతుక్కొంటూ వెళ్లే
దారులే కాల్వలు, బోదెలు –

ఆకాశం గర్జిస్తే
నీరు ఉరుకులు… పరుగులు!

~ ~

సంపదలు ఏవీ
కాదు – దైవదత్తం –
సమాజమే ధనమూలం…
స్వేదమే నవీన వేదం!

ఉత్పత్తి
పరాశక్తి!

~ ~

ల్లకీలో దేముడు..
కాలి బాటలో సామాన్యుడు..
రెండు చోట్లా
సాగేది పయనమే –

నీవే దేముడి గమ్యం
దేముడే నీ అధ్యయనం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here