Site icon Sanchika

సరిగ పదమని-27

‘సరిగ పదమని’ (మన రెక్కలు) అనే శీర్షికతో సంచిక పాఠకులకు రెక్కలని అందిస్తున్నారు పురాణం శ్రీనివాస శాస్త్రి.

~ ~

తాటి తోపులు..
పూల పొదలు..
కొండ గుట్టలు..
ఇసుక పర్రలు…

ఎటు చూస్తే అటు
సృష్టి ముఖాలు!

~ ~

క అడుగుతో మొదలు
మహా యానం..
ఒక చినుకుతో మొదలు
మహా యవుసం..

అడుగులో అడుగు
అదిగో అడంగు!

~ ~

కోల్పోయిన పరిమళం
నాసికను తాకదు..
గల్లంతైన జీవితం
బతుకు యానం ఎరుగదు..

కావ్యంలో కొన్ని
పుటలు మాయం

~ ~

యోధ్య పండు
రాలి పడి వెలుగుల
మందిరమవుతోంది
మసీదుగా మెరుస్తోంది!

పక్వానికొస్తేనే
శాంతి ఫలశృతి

Exit mobile version