సరిగ పదమని-28

0
3

‘సరిగ పదమని’ (మన రెక్కలు) అనే శీర్షికతో సంచిక పాఠకులకు రెక్కలని అందిస్తున్నారు పురాణం శ్రీనివాస శాస్త్రి.

~ ~

ష్యా, అమెరికా
రాజేసిన నిప్పు
అఫ్ఘాన్‌లో మతం
వంతుల వారీ నివురు

సకల జన హాహాకారం
‘ధర్మ’ కంటక వికారం!

~ ~

మైనారిటీ, మెజారిటీ
గోల కాదు –
మంచి ఏదో
ఎంచి ఆగు –

నిక్కచ్చితనం ఎక్కడో
అక్కడే శాసన సాగు!

~ ~

తుకంతా బాధయితే
నొప్పికే జీవితాల
నైవేద్యార్పణం
మరణమే ఇక శరణం –

అందుకే విష కౌగిలి
రైతుకయే నెచ్చెలి!

~ ~

ప్రతి ఉదయం
కొత్త కొత్తగా కొందరికి
అసలు ఉదయమే
ఉండదు ఎందరికో

మరి సంతోషం కొలబద్ధ
సన్నాసుల చేతిలో!

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here