సరిగ పదమని-29

0
2

[dropcap]’స[/dropcap]రిగ పదమని’ (మన రెక్కలు) అనే శీర్షికతో సంచిక పాఠకులకు రెక్కలని అందిస్తున్నారు పురాణం శ్రీనివాస శాస్త్రి.

~ ~

ట్టె లాగా
మిగులునొకరు
కట్టె లేరుకు
బతుకునొకరు

పొయ్యి కాలితేనే
బతుకు మెతుకు!

~ ~

ది వికృతి
గుర్తింపు నియతి –
విభజన భజన
నాటి నీతి –

వృత్తికి గుండు గీసి
కులం విగ్గు తొడిగారు!

~ ~

డక నేర్పే పాదం
ఎలా అయ్యింది నీచం?
ధూళిదూసరితం
భూమి సర్వం –

నిలువ లేని వాదన
విలువ లేని జాణ!

~ ~

నుషుల మధ్య సెగ
ఆడ మగ తెగ –
అక్కడే ఆరంభం
ఆరని పగ –

చీలిక గీతికి
ఆది అపశృతి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here