[dropcap]’స[/dropcap]రిగ పదమని’ (మన రెక్కలు) అనే శీర్షికతో సంచిక పాఠకులకు రెక్కలని అందిస్తున్నారు పురాణం శ్రీనివాస శాస్త్రి.
లంచాతురాణాం
న సిగ్గు… న ఎగ్గు…
వోటాతురాణం
న మగ… న ఆడ
మందాతురాణం
న విస్కీ… న రమ్ము!
***
పచ్చపచ్చని దారుల్లో
ఆశల తావులో
నీతుల సంతలో
నిత్యం పల్టీ
కలల కనులపై
కల్లోలం మనిషి!
***
ఫలానా మతం కావాలని
అడిగి పుట్టలేదు…
నన్నే కనాలని
అమ్మ అనుకోలేదు…
యాదృచ్ఛికాలపై
రగడ జగడాలా?
***
చక్కెర… బెల్లం
దేని తీపి దానిదే!
మిరియం… కారం
దేని ఘాటు దానిదే!
వింత రుచుల
కంత నోరు!