సరిగ పదమని-31

0
2

[dropcap]’స[/dropcap]రిగ పదమని’ (మన రెక్కలు) అనే శీర్షికతో సంచిక పాఠకులకు రెక్కలని అందిస్తున్నారు పురాణం శ్రీనివాస శాస్త్రి.

~ ~

నిన్న నుంచి
నేడు లోకి
ప్రయాణం
పని తోనే –

ప్రపంచమైనా, కుటుంబమైనా
ఒంటరైనా, జంటైనా..!

~ ~

తుకు నుంచి
విముక్తి –
అందుకే చావు
వెనుక విరక్తి –

విరక్తితో విముక్తి కాదు –
కావలసింది అనురక్తి!

~ ~

ధ్యాత్మికుడిది
ప్రశ్నలేని జవాబు
ఆలోచనాపరుడిది
జవాబు కోరే ప్రశ్న –

బతుకు వెతుకులాట
ఇద్దరి తండ్లాట!

~ ~

వృత్తులు కులాలై
కాపు చేలో
మేకలు మేస్తే
కత్తుల కోలాటం!

గ్రామీణ వెతల
భారతం ‘బహుళ’!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here