(బాలబాలికల కోసం శతక పద్యాల లోని పద్యాల ఆధారంగా కథలని అందిస్తున్నారు శ్రీమతి ధర్మవరపు చాముండేశ్వరి)
ఎప్పుడు సంపద కలిగిన
[dropcap]అ[/dropcap]మ్మమ్మ చెప్పే పద్యాలూ కథలు వినటానికి పిల్లలు ఆనందంగా పరిగెత్తుకుని వచ్చారు. మేడ మీది గదిలో పెట్టి ఉంచిన చాపలు పిల్లల కోసం, పెద్దలకు పరుపులు వేసి నీటుగా రూమ్ రెడీ చేసారు మానస్, ప్రకృతి. రూమ్ మధ్యలో అమ్మమ్మ కోసం చైర్ వేశారు.
అమ్మ దేవుని దగ్గర దీపం, రూమ్‌లో ఫ్రెష్ ఎయిర్ ఉండేలా నీలగిరి ఆయిల్ అదేనండి యూకలిప్టస్ నూనెతో దీపం పెట్టింది.
అందరు వచ్చి కూర్చున్నాక అమ్మమ్మ, అమ్మ అందరికి పానకం (మిరియాలు యాలకులు బెల్లంతో చేసింది), నానిన పెసరపప్పు, పచ్చి కొబ్బరి, క్యారెట్, కీరా గ్రేట్ చేసివేసింది ఇచ్చారు.
అందరు స్నాక్ తింటుండగా అమ్మమ్మ “పిల్లలు తర్వాతి పద్యం వినండి” అన్నారు.
ఎప్పుడు సంపద కలిగిన
అప్పుడె బంధువులు వత్తురది యెట్లన్నన్
దెప్పలుగ జెరువునిండిన
గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ!
~
తాత్పర్యం:
చెరువు నిండా నీరు చేరగానే వేలకొద్దీ కప్పలు అందులో చేరునట్లే సంపద కలిగిన వారి వద్దకే బంధువులు ఎక్కువగా జేరుకొందురు.
చెరువులో వాన నీరుతో నిండుగా ఉన్నప్పుడు ఎక్కడి నుండో లెక్క పెట్టలేనన్ని కప్పలు.. huge number of frogs వస్తాయి. చెరువు ఎండిపోతున్నప్పుడు ఎలా వచ్చాయో అలాగే విచిత్రంగా మాయం అయిపోతాయి. అలాగే మనకి sudden గా లేదా తెలివితో బోలెడు డబ్బు.. మనీ వచ్చిందనుకోండి.. అంటే మనం బాగా రిచ్ అయిపోతే మనకి తెలియని చుట్టాలు, స్నేహితులు వస్తారు.
~
పిల్లలూ, మనం ప్రకృతిని పరీశీలిస్తే.. If you observe the nature, నేచర్ మనకు టీచర్‌లా ఎన్నో జీవిత పాఠాలు.. life lessons నేర్పిస్తుంది. Nature is the best teacher” అన్నారు అమ్మమ్మ.
“అమ్మమ్మా! నీతి కథ!” అన్నారు పిల్లలు ఉత్సాహంగా.
“ఉండండి. ఉండండి. ఇదిగో నువ్వుల బెల్లం లడ్డులు తింటూ వినండి. నువ్వులు బెల్లం హెల్త్‌కి చాల మంచివి” అని పిల్లలకు పెద్దలకు లడ్డులు ఇచ్చి కథ చెప్పటానికి కూర్చున్నారు. మనమూ విందామా?
***
అదొక పెద్ద అడవి. పచ్చని దట్టమైన చెట్లు. Big thick trees. ఎన్నో రకాల జంతువులు. అడవి అంటేనే lots of creatures animals కదా. అందులో ఒక పెద్ద చెట్టు.. big tree. ఎంత పెద్దది అంటే? ఇంత. సో సో బిగ్. చెట్టు కొమ్మలు branches గొడుగులా విస్తరించి ఉన్నాయి, spread అయ్యాయి. ఆ చెట్టు అంటే అందరికి చాలా చాలా ఇష్టం. చెట్టు కింద, మీద రాత్రి పగలు.. డే అండ్ నైట్.. small insects.. చిన్న కీటకాలు, జంతువులూ, పక్షులు ఉంటాయి. వాటి అన్నింటికీ కావాల్సినంత ఫుడ్.. ఆహారం దొరుకుతుంది. గూడు కట్టుకున్న పక్షులు పగలు, సాయంత్రం musical symphony లా హ్యాపీగా పాటలు పడుతుంటాయి. It’s so beautiful. అలాంటి చెట్టు మీదకు ఒక పెద్ద పక్షుల గుంపు దూరం నుండి వచ్చాయి. పాపం వాటికి వేరే చోట ఫుడ్ లేదుట. అందుకని ఇక్కడి వచ్చాయి, కానీ చెట్టుని పర్మిషన్ అడక్కుండా అవన్నీ చెట్టు మీద గూళ్ళు పెట్టుకున్నాయి.
వేరే వాళ్ళ ఇంట్లో, ప్లేస్‍లో ఉండాలంటే అనుమతి అడగాలి. “చెట్టూ, చెట్టూ! మేము దూరం నుండి వచ్చాము. ఇక్కడ ఇల్లు పెట్టుకుని ఉండవచ్చా? Can we have nest? అని అడగలిగా. కానీ అడగలేదు. పాపం చెట్టు కొద్దిసేపు ఫీల్ అయ్యింది. తరవాత పోనిలే పాపం! పిల్లలతో వచ్చారు ఫుడ్ కోసం ఉండనీ, let them stay అని అనుకుంది. కొత్త పక్షులు, పాత పక్షులు, జంతువులు అన్నీ సంతోషంగా ఉండటం చూసి చెట్టు చాలా ఆనందపడింది. ఇంకా ఎక్కువ fruits.. food ఇచ్చింది.
కొంతకాలం తరువాత ఎందుకో, బహుశా అడవిలో చెట్లు కొట్టటం కారణం కాబోలు వానలు తగ్గిపోయాయి. No rains. అడవి మెల్లగా ఎండిపోవడం మొదలయ్యింది. పెద్ద చెట్టు కూడా వానలు నీళ్లు లేక బలహీనం.. weak అయిపొయింది. సో అందరికి ఫుడ్ ఇవ్వలేకపొతున్నది.
చెట్టు మీద గూడు పెట్టుకున్న పక్షులు మీటింగ్ పెట్టుకుని వేరే మంచి చోటుకు వెళ్లాలని అనుకోవటం విన్న ఆ పెద్ద చెట్టు “మిత్రులారా! కొంతకాలం ఉండండి, వానాకాలం వస్తుంది. మళ్ళీ ఆనందంగా ఉందాము. ఎక్కువ ఆహరం దొరుకుతుంది” అంటూ ఉండమని బ్రతిమిలాడింది.
పక్షులు “నీ దగ్గరుంటే మాకేంటి లాభం. ఫుడ్ తగ్గిపోయింది. నువ్వు వీక్ అయ్యావు. వెళ్ళిపోతాము” అని ఎగిరిపోయాయి.
చెట్టు చాలా బాధపడింది. ‘నేను, అడవి healthy గా ఉన్నప్పుడు, చాలా food ఉన్నప్పుడు నాకు చెప్పకుండా వచ్చినా సరే అన్నాను. నేను, అడవి – మనుషుల తప్పు వల్ల బలహీనం అయిపోతే అందరు వెళ్లిపోయారు. కొంచం సేపు కూడా ఎదురుచూడలేదు. థాంక్స్ చెప్పలేదు’ అని బాధపడింది. అడవి “కష్టంలో ఉంటే స్వార్థంతో వెళ్లిపోయారు. మంచి స్నేహితులు కారు” అంది.
***
“పిల్లలు మనకి ఇలాంటి అనుభవం ఎదురుకావచ్చు. మన దగ్గర ఎంతో మనీ, పవర్ ఉన్నప్పుడు పిలవకుండానే తెలియనివాళ్ళు కూడా ఫ్రెండ్స్ అంటూ వస్తారు. మన దగ్గర అవి లేనప్పుడు వెళ్ళిపోతారు పక్షుల్లాగా. సో మనం తెలివిగా ఉండాలి” అంటూ ముగించారు అమ్మమ్మ.