శతక పద్యాల బాలల కథలు-6

0
2

(బాలబాలికల కోసం శతక పద్యాల లోని పద్యాల ఆధారంగా కథలని అందిస్తున్నారు శ్రీమతి ధర్మవరపు చాముండేశ్వరి)

సిరిదా వచ్చిన వచ్చును

ఎప్పటి లాగే పిల్లలు పెద్దలు – ప్రకృతి వాళ్ళ అమ్మమ్మ చెప్పే శతక పద్యాలూ కథలు వినటానికి వచ్చారు. అందరు బుద్ధిగా శ్రద్ధగా వినటానికి కూర్చున్నారు.

అమ్మమ్మ వచ్చి దీపం వెలిగించారు. అందరు ఒక్క నిముషం ధ్యానం meditation చేసారు. ఎప్పటిలాగే ఆంటీ వాళ్ళు పిల్లలకు తినటానికి రాగి బెల్లం నెయ్యితో చేసిన లడ్డులు, తాగడానికి నిమ్మరసం ఇచ్చారు.

“పిల్లలూ! పద్యం, కథ వినటానికి మీరంతా సిద్ధమా?” అడిగారు అమ్మమ్మ.

“ఎస్! అమ్మమ్మా! We are ready” అన్నారు కోరస్‌గా

“గుడ్” అని అమ్మమ్మ మొదలుపెట్టారు.

~

పద్యం:

సిరిదా వచ్చిన వచ్చును

సలలితముగా నారికేళ సలిలము భంగిన్

సిరిదా బోయిన బోవును

కరిమింగిన వెలగ పండు కరణిని సుమతి.

~

భావం:

సంపద వచ్చినప్పుడు కొబ్బరికాయ లోకి నీరు వచ్చినట్లుగా రమ్యంగా ఉంటుంది. అలానే సంపద పోయినప్పుడు ఏనుగు తిన్న వెలగపండులో గుజ్జు మాయమైనట్లు పోతుంది అని చెప్పాడు బద్దెన.

“పిల్లలూ ఈ పద్యంలో బద్దెన మనుషులకి సంపద.. ఫార్చ్యూన్.. అనుకోకుండా వచ్చి ఎలా పోతుంది అనేది చెప్పాడు.  ఉదాహరణకి మీకు అనుకోకుండా డాడీ లేదా మమ్మీ 100/- రూపాయలు ఇచ్చారనుకోండి. మీరు పొదుపరి అయితే ఓకే. లేదంటే మీరు మనీ వచ్చిన happiness ఫీల్ అయ్యేలోపలే తెలీకుండా ఖర్చు స్పెండ్ చేస్తారు. అప్పుడేమవుతుంది?”

“We feel bad అమ్మమ్మా. Wasteful expenditure అనుకుంటాము” అన్నారు పిల్లలు.

“ఈ పద్యంలో కరి మింగిన వెలగపండు అని వుంది”

“అవును అమ్మమ్మా, ‘కరి మింగిన’ అంటే ఏంటి?” అడిగారు పిల్లలు.

“కరి అంటే తెలుగులో ఏనుగు అని అర్ధం. హాథీ/ఎలిఫెంట్ ఏనుగు తిన్న వెలగ పండు అని చెబుతారు అందరు. ఏనుగు తిన్న వెలగపండు పొట్టలోంచి అలాగే బైటకి వస్తుందని అనుకుంటారు.”

“అలా రాదా?”

“లేదు. ‘కరి మింగిన వెలగపండు’కి ఇంకో లాజికల్ మీనింగ్ ఉందిట. కరి అంటే ఏనుగు, నలుపు అని కూడా అర్థం. కరిమింగిన వెలగపండు అంటే తెలియని ఏదో ఒక క్రిమి లేదా disease వెలగపండు లోకి వెళ్ళి లోపల ఉండే pulp గుజ్జుని బ్లాక్ నల్లగా చేసి తినటానికి పనికి రాకుండా చేస్తుందిట – అని చదివిన గుర్తు.”

ఇంతలో వెనక నుండి “అమ్మమ్మా కథ చెప్పు. జల్దీ” అన్నాడు వరుణ్.

గట్టిగ నవ్విన అమ్మమ్మ కథ స్టార్ట్ చేసారు. మనమూ విందామా?

***

అనగనగ ఒక ఊరిలో ఒక వీధి వ్యాపారి ఉండేవాడు. అంటే కాలనీ లోని ఇల్లిల్లు తిరిగి ప్లాస్టిక్ సామాన్లు అమ్మేవాడు. మంచివాడు. కుటుంబం.. అంటే ఫ్యామిలీకి కావాల్సిన అవసరాలు.. అంటే ఫ్యామిలీ ఫుడ్, హౌస్, స్కూల్ ఫీజు లాంటివి తీర్చటానికి చాల కష్టపడి పనిచేసేవాడు. రోజూ సామాన్లు బండి తోసుకుంటూ గుడి ముందునుండి వెళ్ళేటప్పుడు ఆగి “దేవుడా! ఓ మంచి దేవుడా! నేను నా కుటుంబాన్ని మంచిగా చూసుకోవటానికి చాలా డబ్బు ఇవ్వు.” అని ప్రార్థించేవాడు.

ఒకసారి దేవుడు అతని మాటలు విని దీవించినట్టుగా అతడు కొన్న ఒక లాటరీ టికెట్‌కి బహుమతిగా చాల డబ్బు వచ్చింది. జీవితంలో అంత డబ్బు వస్తుందని అనుకోలేదు. He was very happy. అతడు తనకు లాటరీలో డబ్బు వచ్చిన సంగతి ఫ్యామిలీకి చెప్పాడు. ఎలా ఖర్చు చెయ్యాలి అని భార్యతో మాట్లాడుతుంటే పిల్లలు వాళ్లకి కావాల్సినవి చెప్పారు. లాటరీ డబ్బు వల్ల వాళ్ళు ధనవంతులు అయ్యారు.

సడన్‌గా చాలా డబ్బు రావటంతో వాళ్ళు సరిగ్గా ఆలోచించకుండా ఏది నచ్చితే అది కొంటూ, వృథా ఖర్చులు చేస్తూ పార్టీలు చేసుకున్నారు. రిచ్‌గా కనపడాలని ట్రై చేసారు. కొత్త కొత్త ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చారు. ఎవరైనా డబ్బు జాగ్రత్తగా దాచుకోమంటే తిట్టుకునేవాళ్ళు ‘మాకు తెలుసులే! మా డబ్బు. నీకేంటి?’ అని.

ఇలా కొంత కాలం నడిచింది. After some time, ఒక రోజు అతనికి సడెన్‌గా జబ్బు వల్ల అంటే ill health తో treatment కి చాలా మనీ అవసరం అయింది. ఇంట్లో, బ్యాంకులో, వైఫ్,పిల్లలు ఎవ్వరి దగ్గర అంత మనీ లేదు. ఫ్రెండ్స్‌ని హెల్ప్ అడిగితే “అదేంటి? నువువ్ ధనవంతుడివి కదా! మా దగ్గర లేదు” అని వెళ్లిపోయారు.

బంధువులు “డబ్బు కావాలంటే ఇల్లు, నగలు అమ్మెయ్” అని సలహా ఇచ్చారు. పాపం అతని దగ్గర అవి లేవు. వచ్చిన డబ్బుని దుబారా చేసాడు. పొదుపుగా తెలివిగా ఇన్వెస్ట్ చెయ్యలేదు. అంటే ఇల్లు, భూమి, బ్యాంకులో పెట్టటం లాంటివి చేయలేదు.

అసలు ఎప్పుడు? ఎలా? ఎంత? ఖర్చు పెట్టింది తెలియకుండా కరి మింగిన వెలగ పండులా వచ్చిన డబ్బంతా ఖర్చయిపోయింది.

అందుకని సుమతి శతక కర్త – సిరి అంటే ధనం జాగ్రత్తగా లేకుంటే ఎలా వస్తుందో, అలాగే వచ్చి పోయినా తెలియదు; తెలివిగా దాచగలిగితేనే గొప్పతనం – అని అన్నాడు.

***

“పిల్లలూ, మీరు కూడా మీకు అమ్మానాన్నలు, పెద్దలు ఎవరైనా గిఫ్ట్‌గా, పాకెట్ మనీగా డబ్బు ఇస్తే తొందరపడి స్పెండ్ చెయ్యకూడదు. అవసరానికి మించి ఖర్చు పెట్టవద్దు. మీకు ఒక పెన్సిల్ అవసరం అనుకుందాం,  4 పెన్సిల్స్ కొంటే అది అనవసరం అని అర్థం. దాచుకోవటానికి ప్రయత్నించాలి. పొదుపు ఎప్పుడు మంచిదే” అని ముగించారు అమ్మమ్మ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here