సత్యాన్వేషణ-34

0
2

[box type=’note’ fontsize=’16’] ఇది ఆత్మాన్వేషణ. ఇది సత్యాన్వేషణ. సత్యాన్వేషణ పథానికి మార్గదర్శనం చేసే గురువు అన్వేషణ. సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం. [/box]

[dropcap]“నే[/dropcap]నూ వారణాసికే స్వామీ” అన్నాను ఉద్రేకముతో తడబడిపోతూ.

ఆయన “అలాగా” అంటూ నిదానముగా తలవూపారు.

“నేను ఆంధ్రాశ్రమములో వుంటాను. రేపు ఉదయము పదింటికి అక్కడిరా అమ్మా!” అంటూ పిలిచారు. “అక్కడ వివరముగా మాట్లాడుకుందాము”.

నేను మరచినా నన్ను మరవని నా దేవదేవుని మీద నాకు కలిగిన ప్రేమా గౌరవము చెప్పలేను. నా హృదయము మైనములా కరిగిపొయింది. కన్నులు వెంట కన్నీరు ఆపలేకపోయాను. కరిగి నీరవుతున్నాను. ఉద్రేకమైన పరిస్థితులలో ఎలాగో విమానము ఎక్కాను.

నేనూ, స్వామివారు అలా ఒకే విమానములో ప్రయాణించి వారణాసి చేరాము. అక్కడ మళ్ళీ అయనకు నమస్కరించినప్పుడు మళ్ళీ గుర్తు చేశారు “రేపు ఉదయము రా అమ్మా!” అని.

నేను తలపూపి నాకై ఎదురుచూస్తున్న ఆ బ్రాహ్మణ బృందము బసచేసిన సత్రానికి చేరుకున్నా. ఇలా కరిగి నీరైన స్థితిలో పవిత్ర కాశీ పట్టణములో ప్రవేశించాను.

కాశీ మహానగరము లోని దూళితో సహా సర్వము పవిత్రమైనవే కదా! ఆ నగరము యుగయుగాలుగా హైందవ సనాతన ధర్మానికి పట్టుకొమ్మలా నిలబడి వుంది. యుగాలు మారినా కాశి నగరములో నివాసయోగ్యముగా వున్నది. ప్రపంచము, నగరాలు మారినాయి, కానీ కాని సదా ముఖ్యమైన నగరముగా మానవులకు తెలిసినంత చరిత్రలోనూ వర్ధిలుతోంది. దానని ప్రపంచపు అత్యంత నివాస పురాతన నగరముగా గుర్తించాలన్న ప్రయత్నము జరుగుతోంది. ఎవరు అవునన్నా, కాదన్నా కాశీ చరిత్రకు అందనంత పురాతనమైనది. కాశీ చూడాలని హైందవులే కాదు, జిజ్ఞాసి అయిన ప్రతి భారతీయుడు, ఆ మాటకొస్తే ప్రతి యాత్రికుడు తపిస్తాడు. ఆ నగర చరిత్రలో హిందువులతో పాటు సర్వమతాలు, సర్వ ఉద్యమాలు చోటు చేసుకున్నాయి.

ఉస్మాన్ బిస్బిల్లాఖాన్‌ను విదేశాలకు రమ్మంటే రానని కరాఖండిగా చెప్పేవారట. అక్కడ మా గంగ, విశ్వనాథుడు వుందడు కదా యని. ఆ గాలిలో వున్న మహత్యము ఒకరు అనుభవించవలసినదే కాని వర్ణించ మనమెంతవారము?

త్రినేత్రుని త్రిశూలము మీద నిలచిన నేల
కాలభైరవుడే కావలి వున్న మరుభూమి ఈ నేల
అన్నపూర్ణమ్మ తల్లి అన్నార్తులకు, ఆహారముగ జ్ఞానం వడ్డించు నేల
డుంఢి గణపతి ప్రథమగణమై నిలచి కావలి వున్న నేల
గంగమ్మ తల్లి విశ్వనాథుని పాదాలను పవిత్రముగా కడుగునేల
సంకటము తీర్చు హనుమ కొలువైన వీరభూమి ఈ నేల
చింతలు తీర్చు చింతామణి గణపతి వెలసిన ధైర్యభూమీ ఈ నేల॥
వెలుగలనుపంచు ఆదిత్యుడు రుగ్మతలు తీర్చ ప్రకాశించు వెలుగుల నేల
మృత్యవును జీవితపు భాగముగా చూపు రుద్ర భూమి ఈ నేల॥

విశ్వేశం మాధవం డుంఢిం దండపాణించ భైరవం।
వందే కాశీం గుహం గంగాం భవానీం మణికర్ణికాం॥

నేను పండితుల సమూహానికి చేరిన తరువాత, నాకు తెలిసిన బ్రాహ్మణ పండితుడు నాతో ‘దూళి దర్శనము’ చేసుకుందాము రమ్మని పిలిచాడు. నేను నాకు చూపిన గదిలో నా బ్యాగు వుంచి వెంటనే పయలుచేరాను. నాకు స్వామివారిని చూచిన ఆ ఉద్రేకము ఇంకా తగ్గలేదు. అంత విచిత్రమైన యదృచ్ఛికంగా నాకు తెలిసి నా జీవితములో జరగలేదు. అంత కోఇన్సిడెంటూ కేవల పరబ్రహ్మ సంకల్పము వల్ల తప్ప జరగదు.

నేను దూళిదర్శనముతో పాటు నాకిచ్చిన గ్లాసు పాలతో విశ్వనాథునికి అభిషేకము చేసుకున్నా. ఆ ప్రక్కన వున్న మండపములో కూర్చుంటే మనస్సు మరింతగా నెమ్మదించింది. ఆ దేవాలయము, మండపము సర్వము నాకు ఎందుకో చాలా ఉన్నతముగా అద్భుత శిల్పకళలలతో వున్నాయనిపించింది. ప్రపంచములోని సర్వశాంతికీ కేంద్రములా వుంది ఆ మండపము. ఇదంతా ఆ మహాదేవుని రచనలా నాకు ప్రవేశము అనుగ్రహించటానికి ఆయన ఏదో ఎత్తుగడగ వేశాడని విచిత్రమైన ఊహలు కలిగాయి. నాకు దివ్యమైన మానసిక శాంతి కలిగింది. నాతో వున్నవారిని నే నిలిపేశానని లేచాను. మేము వస్తుండగా చెప్పాను ఆ పండుతులకు ‘స్వామి వారిని కలవటానికి మరరోజు ఉదయము వెడుతున్నాన’ని.

వారు కాశీలో శివరాత్రి నాడు రుద్రయాగము చెయ్యటానికి వచ్చారు. ఆ యాగానికి స్వామిని ఆహ్వానించమని కోరారు వారు. నేను మౌనముగా తల వూపాను.

ఆ రాత్రి నాకు నిద్ర ఏ కొద్ది సేపో పట్టింది. మరురోజు కోసము నేను ఎప్పుడూ చూడనంతగా ఎదురుచూస్తూ, రాత్రంతా జపము చేస్తూ గడిపాను.

ఉదయమే నేను గదిలో తయారై హుటాహుటిన ఆంద్రాశ్రమముకు వెళ్ళాను.

స్వామి వారు నన్ను ఎనిమిది గంటలకు రమ్మన్నారు. నేను ఎనిమిదికి కొద్దిగా ముందే చేరుకున్నా.

అక్కడ ఆఫీసులో వెళ్ళి స్వామీజీ ఎక్కడున్నారంటే వాళ్ళు మాట్టాడటానికి కూడా ఇష్టపడలేదు. నేను అప్పడు వాళ్ళకి స్వామిని నేను విమానాశ్రమయములో కలవటము, వారే నన్ను రమ్మని పిలవటము అంతా వివరించాను.

ఆఫీసులో వున్న వారు, “ఉందండి. అలా కూర్చోండి. వారు ఇంకా బయటకు రాలేదు. వారి గది తలుపులు తెరవలేదు” అన్నారు కొద్దిగా నిర్లక్ష్యముగా.

నేను ఓపికగా ఆ ఆఫీసులో మూలకు వున్న బల్ల మీద కూర్చున్నాను. ఆ ఆంధ్రాశ్రమము భవనము మధ్యలో తులసికోటలా వుంది. దాని చుట్టూ గదులు రెండు అంతస్తులు వేసారు. అక్కడ ప్రతిరోజూ అన్నదానముంటుందిట. అక్కడ కూర్చున్నప్పుడే వారు నాకు కాశీ గర్భవాసమని వివరాలు చెప్పారు. తొమ్మిది నెలలా తొమ్మిది రోజులు….కాశిని వదిలి చుట్టూ 25 కిలో. లోపు వుండాలి. అలా వుండగలిగితే అది గర్భవాసమంటారు. తల్లి గర్భములో శిశువు వున్నన్ని రోజులు. అలా వుండగలిగితే వారికి ఇక పునర్జన్మ వుండదని ఆ క్లర్కు చెప్పారు. ఆంధ్రాశ్రమములో గదులు ఇస్తారు అలా వుండటానికి.

నేను “నాకో గది ఇస్తారా?” అని అడిగితే…ఆయన నన్ను పైనుంచి క్రిందికి ఎగాదిగా చూచి తలాతోకా లేని ప్రశ్నలతో విసిగించాడు.

“ఎక్కడ్నుంచి వచ్చావు?” అన్నాడా క్లర్కు.

“అట్లాంటా” మాములుగా చెప్పాను.

ఆశ్చర్యముగా చూస్తూ “నీకు పెళ్ళైయ్యిందా? మీ ఆయనెక్కడ? ఏం చెస్తావు? ఎంత మంది పిల్లలు, వంటరిగా ఎందుకు వచ్చావు?” వంటివి మొదలెట్టాడు.

నేను ఓపికగా అన్నింటికీ సమాధానమిచ్చాను.

ఆయనకు అయినా సంతృప్తిగా అనిపించలేదు.

“ఇంత చిన్న వయస్సులో ఎందుకిలా తిరుగుతున్నావు?” అన్నాడాయన.

నేను పలకలేదు. ఇంతలో ఆ ఆఫీసు ప్రక్క గది తలుపులు తెరుచుకున్నాయి. ఆ చప్పుడుకు అటు చూశాను.

స్వామి బయటకు వచ్చారు. నేను లేచి నిలుచున్నా. నన్ను ఒక క్షణము చూచి, గుర్తించి “ఒక్క క్షణం” అన్ని లోపలికి వెళ్ళారు. ఆఫీసులోని క్లర్కు అప్పటికి శాంతించాడులా వుంది. ఏమీ మాట్లాడలేదు.

మళ్ళీ కొంత సేపటికి పిలిచారు.

గది చిన్నది. ఒక సింగిల్ మంచము. కుర్చీలు రెండు వున్నాయి. ఒక కుర్చీలో ఆయన కూర్చున్నారు. నన్ను లోపలికి రమ్మనమని తను కుర్చీలో కూర్చున్నారు స్వామివారు.

నేను వారి పాదాలకు సాష్టాంగనమస్కారములు చేసి ‘శ్రీ గురుభ్యో నమః’ అని ప్రణమిల్లి క్రింద వారి ఎదురుగా కుర్చున్నాను. ఇంతలో స్వామివారి శిష్యరాలు రమ్యా స్వామిణి కూడా వచ్చారు. ఆమె మరో కుర్చీలో కూర్చున్నారు.

“అట్లాంటా వాసి” అన్నారు స్వామి పరిచయం చేస్తున్నట్లుగా ఆమెతో. ఆమె తల వూపారు.

ఇంతలో కాషాయంబరదారి ఒకరు వచ్చారు. గది తలుపులు తీసి వున్నందునేమో ఎకాఎకి లోపలికొచ్చి వచ్చి స్వామివారిని మర్యాదగా గ్రీటు చేసి అక్కడ మరో కుర్చీలో సెటిల్ అయ్యారు.

స్వామి నన్ను అడగబోతూ వుంటే ఈ కొత్తగా వచ్చిన సన్యాసి ఎవరినీ మాట్లాడనీయ్యక గలగలా మాట్లాడుతూ స్వామివారితో చుట్టరికము గురించి వివరిస్తూ వున్నారు.

ఆ కొత్తగా వచ్చిన కాషాయంబరధారి తనకు తప్పిపోయిన సంబంధములో స్త్రీ మీద ఆయనకు వున్న అభిమానము గురించి స్వామికి చెబుతుంటే మన స్వామివారు నిరాసక్తిగా తల వూపుతూ కొంత సేపు వూరుకొని తరువాత తనకేమీ గుర్తులేదని మర్యాదగా చెప్పారాయనకు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here