Site icon Sanchika

సీతాకోక చిలుక

[box type=’note’ fontsize=’16’] సీతాకోక చిలుక, పువ్వులు, ఓ స్త్రీ సంభాషించుకునే ప్రకృతి దృశ్యాన్ని కవితాత్మకంతా చిత్రిస్తున్నారు తాళ్ళపూడి గౌరి ఈ కవితలో. [/box]

[dropcap]ఉ[/dropcap]దయ సంద్య వేళ… తోటలో నేను
నా ముందు ఎగురుతున్న ఓ సీతాకోక చిలుక
ముచ్చట పడి చూస్తూ అడిగా…
ఓ రంగుల రంగుల సీతాకోక చిలుకా
నీ గంతులు ఎందాకా

“వసంత ఋతువులు పూల సోయగాలు చూసి
మనసు పులకింప చేసుకోనుటకు వెళుతున్నా..
గండు తుమ్మెదల రొద విని బెదిరిపోయా కాని
హాయిగా పూలని తాకనిదే నా మనసు ఊరడిల్లదే
ఈ తుమ్మెదల రోద ఆగేదెప్పుడో కదా…. ”

పొద్దు వాలిపోతుంది.
నా మదిలో దిగులు పెరిగి పోతుంది.
ఆ పూల అందాలు నేడు చూడక పోతే
రేపటికి రేకులు వాలి వడలి పోతాయి కదా

అప్పుడు పూవులు అంటున్నాయి…
పూల అందాలని చూడలేదని దిగులెందుకు?
మా పూల అందాల కన్నా మీ మేనులో ఎన్నో రంగులున్నాయి… అది మీరెరుగుదురా
మీ మానవ జాతి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు
మీ అందాల రంగులు చూసి మేము మురిసిపోతుంటాము.
కాని నీవు మమ్మల్ని మా అందాలని పొగుడుతున్నావు
మా ఒంటి రంగు మాకు తెలియదు
మా కళ్ళకు కనిపించే ఏకైక అందం పూలు

పూల వలనే మా జీవితమూ ముగిసిపోతుంది
అందుకే పూల అందాలను చూసి
మురిసి పోవాలని వచ్చా…
కాని నాకు తోడు ఎవరూ లేరు
ఒంటరి గానే వచ్చాను
ఏం చేస్తా తిరిగి వెళ్ళిపోతున్నాను
అంతలో నీవు కనిపించావు (సీతాకోక చిలుక)
ఇంత ఆనందాన్ని ఇచ్చావు.

అప్పుడు ఆ సీతాకోక చిలుక
నా భుజం మీద వాలింది ప్రేమగా
నా వంక చూసింది. నేను చూస్తుండగానే
విశాల ప్రపంచంలోకి హాయిగా రెక్కలు విప్పుకుని
ఆనందంగా ఎగిరిపోయింది.

Exit mobile version