సీతారామ యుద్ధం!

0
2

[dropcap]నా[/dropcap]కు పండగొచ్చిందంటే భయం!
అల్లుడొస్తాడనో –
మామూలోళ్ళస్తారనో కాదు!
నా భార్యను చూస్తేనే!?

పండుగ శుభాకంక్షలు
చెబుదామని సెల్‍ఫోన్ తీస్తానా –
వంటింట్లో గిన్నెలు
శివతాండవమాడతాయి!
మాటల తూటాలు గుండెను
తూట్లు పొడుస్తాయి!
నే బడుద్ధాయినై వెలవెలబోతాను!
శుభాకాంక్షలు గాలిలో కల్సిపోతాయ్!
వెంటనే సెల్‍ఫోన్ మూగబోతుంది
ఉగాది కవిత్వమై ఊరేగాలనుకుంటానా –
కలం తీసి కాగితం మీద పెట్టబోతానా –
“బుద్ధి లేకపోతే సరి
పొద్దున్నే పనికిమాలిన పనులు
కాస్త వంటింట్లో సహాయం చెయ్యొచ్చుగా!”
సర్రున సతీమణి లేస్తుంది!
కాగితం మూడు ముక్కలై
మూలన మూలుగుతుంది!
కలం గోడకెళ్ళి బుర్ర బాదుకుంటుంది!
హృదయం ఛిద్రమై
మౌనం విస్ఫోటిస్తుంది!
ఇక ఇంట్లో సీతారామయుద్ధం మొదలౌతుంది!
అంతరంగాలు అల్లకల్లోలమై
ఆధ్యాత్మిక భావన అటకెక్కుతుంది!
అందుకే పండగంటే నాకు భయం
భార్యామణి ఇవ్వాలి అభయం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here