[అనూరాధ బండి గారు రచించిన ‘సెలవేనా’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]రా[/dropcap]త్రి చలిలో గడ్డకట్టిన మెదడు
పగటి సూరీడి సెగలకి కరుగుతూ
బద్ధకపు కళ్ళని విప్పుతూ
దుప్పటి వెలుగుని పరికిస్తూ
చలనసహిత క్షణాల ఆనవాళ్ళు
పాదాలను గుచ్చినట్లై..
ఒకింత తొట్రుబాటు
మరికాస్త కలవరం
ఒక చిరుమందహాసపు వేడితో..
కళ్ళు సవరించి
కాళ్ళని విదిలించి,
తలపులు తలుపులకు
ఆవలగా తెరచి
ఇప్పుడే పుట్టిన రోజుని
ఆసక్తిగా భక్తిగా పరికిస్తూ..
తన్మయత్వమా కలవరమా తేల్చుకోలేక
సెలవుచీటీలా పడిఉండే అవస్థలో
మళ్ళీ ముసుగేసి మనసుకి
పడకేసి మెదడుకి
సెలవునిద్రపోతే..
నిశ్శబ్దం లెక్కించి పాఠం చెబుతుంది
నువ్వు సెలవులో ఉన్నావని
సందర్భంగా సందర్భంలో