[dropcap]సే[/dropcap]వ సేవ సేవా సేవా
చేవ వుంటే చేయి సేవా
రావా రావా రావా రావా
సేవ చేయగ నువ్వే రావా
సేవ అంటే సొమ్ముకు కాదు
సేవనెప్పుడూ అమ్ముకోరాదు
సేవ చేయి సూర్యుడి లాగా
సృష్టి రహస్యపు సారమిదనేగా ॥ సేవ॥
ఆకురాలిన కొమ్మారెమ్మా
కోలుకోక విరిగేనా..
అందమైన చిగురులు తొడిగి
అవనికి అందం అద్దలేదా
ఆగక పొంగే నదీనదమ్మ
అవనినీ అమ్మగా ఎంచుకోలేదా
అమ్మ సేవలో తరించి తాను
మానవ సేవలో మురిసిపోలేదా ॥ సేవ॥
మానవ సేవే మాధవ సేవ
మనిషికి సేవ పేటెంట్ కాదు
సేవకు లైసెన్స్ అక్కర్లేదు
దేవుని సేవలని దోచుకోవద్దు
వద్దు వద్దు వద్దు వద్దు
గాలిని గలీజు చేయవద్దు
నీటిని మురికిగా మార్చవద్దు
కద్దు కద్దు కద్దు కద్దు
సేవ ఒక్కటే బాటగ కద్దు
సేవ నువ్వు చేసే ముద్దు ॥ సేవ॥
మండుటెండలు.. పండువెన్నెల
పుడమి సేవలో తరించు
తల్లి ప్రకృతి ప్రతిరూపం మనిషి
మూలం మరువక సేవించు
అజ్ఞానం అనే కొమ్ములు కోసి
అలల.. లలననా ఆలోచన పెంచి
ఆగిపోని కాలంలా సాగి సేవ చేయాలా
సేవ ఉంటే చేయాలా ॥ సేవ॥