Site icon Sanchika

శాంతి కోసం విశ్వ గీతం

[dropcap]అ[/dropcap]క్కడ విలయం తాండవించే
మబ్బులు మెరిసిన ఆకాశంలో
అగ్ని కీలలు మిస్సల్లై ఎగిరే
మనుషులు విగత జీవులై మిగిలే
సమాధుల అగ్నిలో అవయవాలు
పిడికిలి తెరిచిన మృత్యువాతలు

జీవం లేని మనుషులు
చేసే యుద్ధంలో రాజ్యకాంక్ష పెట్రేగింది
అగ్రరాజ్యం విసిరింది చిన్నదేశంపై ఉగ్రదాడిలో క్షిపణి అస్త్రాలు వేసే
వెర్రితలలు వేసి తలకెక్కిన స్వార్థం
ప్రపంచానికి పెను సవాలైంది శాంతి స్థాపన దిశలో

రక్తపుటేరులైన జనావాసాలన్నీ
ఆర్తనాదాలూ ఆవేదనలన్నీ
మరూభూమిలో పసిగొంతుల రోదనే
అమానవీయ రాక్షస విన్యాసాల
పెచ్చరిల్లింది యుధ్ధం వికృతంగా

అమానుష విషాద గీతంలో తెగిన
విశ్వ వీణ తీగలు
ప్రశాంత హృదయ స్పందనల నిండిన సంగీత రాగాలలో వినిపించాలి శాంతి సందేశాలు
యుధ్ధంచేసే కనరు మాటల ధిక్కారం స్వరం
నెనరుగా స్వరాలన్నీ శాంతి దీపం
వెలిగించాలి

అశాంతి అభద్రత బెదిరింపుల భయానక రక్తదాహంలో
చెదిరిన మనసులన్నీ ఏకమై
యుధ్ధం చేయాలి శాంతి స్థాపనకై

మనిషిని ప్రేమించే మనిషి
మళ్ళీ పుట్టాలి క్రాంతి మార్గదర్శిగా
మబ్బుల విషాదం మాసిపోయి
కాంతి కురిసిన శాంతి వర్షం రావాలి

 

Exit mobile version