[dropcap]ఆ[/dropcap]వేశం ..
అనర్థానికి దారితీస్తుంది!
అనాలోచితంగా ప్రవర్తిస్తే ..
నువ్వు..’నా’ అనుకునే వారందర్నీ
నీ నుండి దూరం చేస్తుంది!
ఆ తరువాత
ఎంతగా పశ్చాత్తాప పడినా
దూరమైన బంధాలన్నీ
ఎంతమాత్రం దగ్గరవ్వవు ..
ఈ సమాజం సైతం నిన్ను ఒంటరిగా నిలబెట్టేస్తుంది!
అందుకే నేస్తం ..
సరి అయిన దిశగా ఆలోచన అవసరం!
నిన్ను నువ్వు నిగ్రహించుకుని
ఆగ్రహాన్ని అదుపులో పెట్టుకుని
ఎంతటి క్లిష్టమయిన సమస్యనైనా..
ఎదుటివారి ఉనికిని గౌరవిస్తూ
వారి వాదనని సైతం ఆలకిస్తూ
పరిష్కారం గురించి అన్వేషిస్తూ
నిర్ణయాలు తీసుకుంటే ..అదే శాంతిమంత్రమవుతుంది!
ఈ సమాజానికి దిక్సూచిలా పనిచేస్తూ
నీ మాటే నలుగురికి ఆదర్శవంతమవుతుంది!