[dropcap]మా[/dropcap]లతీ చందూర్ గారు రచించిన ‘శతాబ్ది సూరీడు’ నవలపై పరిశోధనాత్మక వ్యాసాలను ఆహ్వానిస్తూ 2021లో తెలుగుశాఖ, కాశీ హిందూ విశ్వవిద్యాలయం, పొట్టి శ్రీరాములు స్మారక సమితి చెన్నై వారు సంయుక్తంగా నిర్వహించిన పోటీల్లో 20 మందికిపైగా పాల్గొని తమ పరిశోధనాత్మక వ్యాసాలను పంపారు. వాటిలో మొదటి పరిశీలనలో న్యాయ నిర్ణేతల ప్రమాణాలకు నిలిచినవి ఆరు మాత్రమే.
మహిళను సమాజం, ప్రపంచం ఎలా చూసింది? ముఖ్యంగా ఆధునిక కాలంలో మహిళ తన అస్తిత్వం పట్ల కలిగిన స్పృహ, అస్తిత్వానికై చేసే పోరాటంలో ఈ నవల అందించిన చైతన్యం, అలాగే సంప్రదాయాల మధ్య నలిగి పోయే స్త్రీ, ఆ సంకెలలను తెంచుకునే ప్రయత్నం చేసే ఆధునిక స్త్రీ చేసిన ప్రయత్నం, పోరాటం గ్రంథ రచయితలు ఎలా అర్థం చేసుకున్నారన్నది ప్రధానంగా చేసుకొని న్యాయ నిర్ణేతలు పరిశీలించారు.
ఈ నేపథ్యంలో పాణ్యం దత్తశర్మ ఈ నవలపై చేసిన పరిశోధన సముచితంగా ఉందని న్యాయ నిర్ణేతలు భావించారని ఆచార్య బూదాటి వెంకటేశ్వరులు ఒక ప్రకటనలో తెలిపారు.
త్వరలో నిర్వహించే సభలో దత్తశర్మ గారికి రూ 25,000/-నగదు పురస్కారం, బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం వారి గౌరవ పత్రం అందించనున్నారు.