Site icon Sanchika

శోభకృత్‌కి స్వాగతం

[dropcap]కొ[/dropcap]త్త మామిడి చిగురు పూయగా
కోకిలమ్మ గానము చేయగా
వచ్చింది శోభకృత్ కొత్త శోభతో

ప్రతి ఏడూ అదే ఆరు రుచులు
అందరూ తింటున్నా, శోభనంగా
కొత్త రుచిని తెచ్చా నేను అంది

తీపి కారం పులుపు ఉప్పు
వగరు చేదు మాత్రమే కాదు
ఆనందమనే అద్భుత రుచి
నందన వనం నుండి తెచ్చా నేను

ఈ కొత్త రుచిని మీరంతా
ఏడాది అంతా ఆస్వాదించి
గడపాలని గడప గడపలో
నూతన తేజం నిలపాలని
శోభకృత్ మనతో సెలవిచ్చింది

శుభకృత్‌కి శుభం పలుకుతూ
శోభకృత్‌కి స్వాగతం చెబుతూ
ఆనంద రుచిని ఆస్వాదిద్దాం
ఏడాది పొడుగునా పొగుడుతు ఉందాం

Exit mobile version