‘సిరికోన’ చర్చాకదంబం-11

0
3

[box type=’note’ fontsize=’16’] సిరికోన వాక్స్థలిలో జరిగిన చర్చ పాఠ్యాన్ని కూర్చి అందిస్తున్నారు డా. గంగిశెట్టి లక్ష్మీ నారాయణ. [/box]

[dropcap]జీ[/dropcap]వితం చిగురిస్తూనే ఉంటుంది

వైషెబబ, యుక్రేనియన్ సైనికుడు

(Life will prevail: Vyshebaba ,Ukrainian soldier)

రెండు కవితారూపాలలో సిరికోన అనువాదాలు

(పద్య కవితానువాదం : డా.కోడూరు ప్రభాకరరెడ్డి

వచన కవితానువాదం : శ్రీమతి హైమా భార్గవ్)

వ్యాస రూపకల్పన : గంగిశెట్టి లక్ష్మీనారాయణ (విశ్రాంత ఆచార్యుడు)

ప్రపంచ చరిత్రలో 21వ శతాబ్ది మానవ నాగరకతను ఏ మలుపు తిప్పుతున్నదో తెలియదు కానీ, 2020 నుంచి ప్రారంభమైన ఈ మూడవ దశాబ్ది మాత్రం, ప్రపంచానికేదో మూడిందనే భయభ్రాంతిని రేకెత్తించింది.

ప్రపంచాన్ని అత్యంత భయంకరమైన రెండు అనుభవాలకు లోను చేసింది. రెండూ మానవ కల్పితాలే.. వికట రూపం దాల్చిన అధికారలాలసకు ఫలితాలే. అందులో మొదటిది కరోనాగా ప్రకృతిపరమైపోయి, అనూహ్య బీభత్సాన్ని సృష్టిస్తే, రెండవదైన యుక్రెయిన్ – రష్యా యుద్ధం రాజ్య హింసకు పరాకాష్ట రూపమై, అందరూ ఊహించదగ్గ, నివారించదగ్గ బీభత్సాన్ని సృష్టించింది… ఇక్కడ ఈ రెండో బీభత్సానికి సంబంధించిన ఒక కరుణార్ద్ర పార్శ్వం పరామర్శ ఈ వ్యాసవిషయం.

దాని నేపథ్యపు చర్చకు ఇక్కడ వెళ్ళటం లేదు… అంత బీభత్స కాండలోనూ మానవునిలోని వసివాడని ఆశావాదం, ప్రేమ, జీవన సౌందర్య భావన అభివ్యక్తమైన ఒక సందర్భాన్ని మాత్రమే ఇక్కడ చూస్తున్నాం.

యుక్రెయిన్ లోని ఒక సైనికుడు తన చిన్నారి బిడ్డకు రాసిన లేఖ విషయం ఇది. అది ఒక తండ్రి తన బిడ్డకు రాసిన స్ఫూర్తి లేఖ మాత్రమే కాదు… కోటిపుటల చిరంతన జీవన తత్త్వాన్ని వ్యాఖ్యానించే మానవ ప్రేమ గీతిక. దాన్ని యుక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ‘Life will prevail’ పేరిట విడుదల చేస్తే, చేసిన వెంటనే పది భాషలలోకి అనువాదం పొందింది. వైషెబబా అనే ఆ యుద్ధవీరుడు, తన చిన్నారికి రాసిన ఆ కరుణార్ద్ర సందేశం, జీవితంలో పోరాటాలను ఎదుర్కొనే ప్రతి యోద్ధా, ప్రతి సందర్భంలోనూ, తాను స్మరించుకుని, తనవాళ్లకు అందించవలసిన ప్రబోధ సందేశం!

ఎన్ని విపత్తులు వాటిల్లినా, నిత్యం చిగురిస్తూ ఉండే జీవితానికి అర్థం చెప్పే కరుణార్ద్ర గీతిక ఆ స్ఫూర్తిసందేశం…. ఆ గీతిక పైది:

(https://m.tribuneindia.com/news/trending/dont-write-about-the-war-to-me-ukrainian-soldier-replies-daughters-letter-through-a-poem-398401)

***

ఈ గీతికను ఈ మే 27 న మా సిరికోన సభ్యురాలు, ప్రముఖ రచయిత్రి, హైమా భార్గవ్, ఎంతో ఆర్ద్రతతో ఇలా అనువదించి పరిచయం చేశారు.

ప్రియమైన చిట్టి తల్లికి!
తల్లీ! యుద్ధం గురించి నాకు రాయకు మళ్ళీ!
ముందుగా నాకు సమాధానం చెప్పు!
నీకు దగ్గరలో ఓ తోట వుందా?
పాకే నత్తలు, ఎగిరే మిడతలు, కనబడుతున్నాయా?
కోయిల పాటలు వినబడుతున్నాయా?
నువ్వున్న ప్రాంతం లోని వారు
పిల్లుల్ని ఏమని పిలుస్తారు? వాటి పేర్లు చెప్పవూ!
నాకు నిజంగా కావలసింది ఏంటో తెలుసా?…….
నీ ఉత్తరాల్లో దుఃఖపు ఛాయలను సైతం తుడిపివెయ్యడం!

చెర్రీ చెట్లు పూలు పూస్తున్నాయా?
ఎవరైనా నీకు ఇష్టమైన పూల గుచ్ఛాన్ని తెచ్చిస్తే ,
వారికి భయపెట్టే మిసైల్ పేలుళ్ళ గురించి చెప్పకు!
మన అందమైన జీవితం గురించి చెప్పు…!!

యుద్ధం సద్దుమణిగాక యుక్రైన్‌కు వచ్చేందుకు
సిద్ధంగా వుండమని తెలిసిన వారిని ఆహ్వానించు….
మన దేశంలో పిల్లలు క్షేమంగా, భద్రంగా
వున్నారని తెలుసుకున్న మన ఆత్మీయులకు
నిండు మనసుతో కృతజ్ఞతలు తెలుపుకుందాం…!!

―మూలం: వైషిబబా, యుక్రైన్ సైనికుడు

― అనువాదం: హైమా భార్గవ్

మూల గీతం ఎంత సరళ సుందరంగా, కరుణరసభరితంగా ఉందో, అనువాదం కూడా అంతే ఆర్ద్రంగా, ఆత్మీయంగా సాగిందనడంలో అతిశయోక్తి లేదు… అది మా కోన మిత్రులనందరినీ ప్రభావితం చేసింది.

***

అందరూ ప్రభావితమైనది ఒక ఎత్తు. మా వరిష్ఠ సభ్యులు, సుప్రసిద్ధ కవి డా. కోడూరు ప్రభాకరరెడ్డి గారు ప్రభావితులైనది ఒక ఎత్తు.. వృత్తి రీత్యా వారు శిశువైద్య నిపుణులు.. ఆ వృత్తిధర్మంతో పిల్లల వస్తువుకు అతి సహజంగానే హృదయం సంచలించి పోతుంది. పైగా, కవిత్వంలో వారిదెప్పుడూ కోమల శైలి. వారి బిరుదు కూడా, ‘కోమల గీతకవితా వల్లభు’లని. ఆ సహజ కోమల ప్రవృత్తితో వారు తమ కవితామాధ్యమమైన పద్యంలో ఇలా అనువదించారు:

యుద్ధం గురించి నాకు రాయబోకు

మూలం:వైషిబబా(యుక్రెయిన్ సైనికుడు)

తెనుగుసేత:శ్రీమతి హైమాభార్గవ్

పద్యపరివర్తనం:డా.కోడూరు ప్రభాకరరెడ్డి

రణరంగ వార్తలు నాకు వ్రాయబోకు-
ఈ ప్రశ్నకు ముందుగా బదులీయవమ్మ?
దాపునున్నదా తల్లి ఉద్యానవనము?
ప్రాకునా నత్తలన్నియు పరవశాన?
ఎగురునా శలభమ్ములు ఎదురులేక?
‘కుహు కుహూ’ యంచు పాడునా కోయిలమ్మ?

పిల్లులే పేర్లతో నట పిలువబడును?
వాని పేర్లను చెప్పవా పసిడిబొమ్మ!
తుడిచివేయుము మదినుండి దుఃఖమంత
అదియె నీ నుండి నే కోరు ఆస్తి తల్లి!

చెలగి పుష్పించుచున్నవా ‘చెర్రి’ చెట్లు?
నీకు నచ్చిన పూమాల నెవ్వరేని
తెచ్చియిచ్చినవారికి తిరిగి నీవు
చెనటి బాంబుదాడుల గూర్చి చెప్పకుండ
చికిలి జీవితమ్మును గూర్చి చెప్పవమ్మ!

యుద్ధమంతయు చివరికి సద్దుమణుగ
భయము లేకుండ యుక్రెయిన్ వచ్చుకొఱకు
సమున్నతంగా పెరిగింది…
“తుడిచివేయుము మదినుండి దుఃఖమంత
అదియె నీ నుండి నే కోరు ఆస్తి తల్లి!”

అది ఏ యుద్ధమైనా కానీ, యుద్ధం లోకి వెళుతున్న ఒక తండ్రి అంతకంటే గొప్ప ఆకాంక్షను ఏం వ్యక్తపరుస్తాడు? అంతకంటే గొప్ప ధార్మిక సందేశం ఏం ఇస్తాడు? ఆ ఒక్క మాటతో, తన ముమ్మనుమల విషాదాన్ని చూసిన , వ్యాసుడు భారతం పేరిట ఏం వ్రాశాడో మనకు అర్థం కావటం లేదూ!!??

***

కోడూరు గారి అనువాదం ఎంతో సరళంగా, శక్తిమంతంగా ఉంది!!.. అయినా అది మా కోన పాఠకుల్లో ఎక్కువమందికి ‘ఎక్కలేద’నుకొంటాను… అంతకంటే హైమ గారి అనువాదం ఎక్కువమంది హృదయాలను స్పృశించిందేమో.. కారణం..?… అది పద్య కవిత. ఇది వచన కవిత … ఒకరకంగా అవును, ఒక రకంగా కాదు!.. వచనకవితలో భాష ఇవ్వాళ్టిది… వెంటనే చాలామంది కనెక్ట్ అవుతారు… పద్యకవితలో భాష మొన్నటిది… గ్రాంథికం. కవిగారు ఎంత సరళంగా, వెంటనే అర్ధమయ్యేటంత తేలిక భాషలో రాసినా, ఛందో వ్యాకరణ నియమాలకు బద్ధులై గ్రాంథిక భాషను వాడటం వల్ల, ఈ ఫేస్‌బుక్ యుగం లోని పాఠకులు కేవలం మామూలుగా మాట్లాడుకునే నిత్య వ్యవహార భాషకే అలవాటు పడి ఉండటం వల్ల, ఎమోషనల్‌గా కనెక్ట్ కావటం లేదు… చక్కటి వ్యావహారికమైనా, ఇంగ్లీషు పదాలు వాడకుండా, కేవలం తెలుగు మాటలే వాడితే “మీరేమిటో గ్రాంథికం రాస్తుంటారండీ!” అంటూ పేరున్న రచయిత్రులే మోపిన అభియోగానికి , నిశ్శబ్దంగా గురైన అనుభవం ఈ వ్యాసరచయితది! కాల స్వభావం అని నిస్పృహతో భరించాలి…

ఆ కాలస్వభావం వల్లనే పద్య అనువాదం కంటే, వచన కవిత అనువాదానికే ఇవ్వాళ్టి సగటు పాఠకులు వెంటనే కనెక్ట్ అయ్యారు. దేని ప్రత్యేకత దానిది.. ఏదేతైనేం? ఒక గొప్ప కరుణార్ద్ర గీతిక అనుభవించేటందుకు… మానవులుగా మనగలిగేటందుకు!? జీవితం చిగురిస్తూనే ఉంటుందని ఆ యోధుడి మాటలోని నిర్వేద సత్యాన్ని గుర్తించేటందుకు!!! **

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here