[dropcap]ప్ర[/dropcap]తి సంవత్సరం సిరికోన సాహితీ అకాడమీ పక్షాన నిర్వహించే స్వ. జొన్నలగడ్డ రాంభొట్లు – సరోజమ్మ స్మృత్యంకిత నవలా రచన పోటీ నిమిత్తం అముద్రిత – అప్రకటిత – తాజా రచనలు ఆహ్వానించబడుతున్నాయి.
ఈ మారు పోటీలోని ముఖ్యంశాలు:
- ఉత్తమ నవలకు నగదు బహుమతి 50 వేల రూపాయలు. న్యాయ నిర్ణేతలు సర్వోత్తమంగా దేనినీ నిర్ణయించని పక్షంలో పై బహుమతి మొత్తాన్ని, ప్రథమ (25000/-), ద్వితీయ (15000/-) తృతీయ (10000/-) బహుమతులుగా అందజేయబడుతుంది.
- రచయితలు తమకు నచ్చిన ఇతివృత్తం మీద తాము స్వేచ్ఛగా రాయవచ్చు.
- అధిక సంఖ్యలో మంచి రచనలు వచ్చిన పక్షంలో, న్యాయ నిర్ణేతలు సిఫారసు చేస్తే అదనంగా రెండు ప్రోత్సాహక బహుమతులను కూడా ఇచ్చే అవకాశం ఉంది.
- పోటీ కోసం సమర్పించే నవలలు కనీస పక్షంగా 120 పుటలకు తగ్గకుండా ఉండాలి.
- ఇతివృత్తంలో కానీ, పాత్ర చిత్రణాది నవలాశిల్పంలో కానీ, ఉన్నత ‘మౌలిక’ ప్రమాణాలతో కూడిన నవలలకే ప్రాధాన్యం. అనువాద నవలలు పోటీకి అంగీకరించబడవు. స్వతంత్ర రచనలే అయి ఉండాలి.
- కేవలం అముద్రిత – అప్రకటిత – తాజా రచనలే పోటీకి స్వీకరించబడతాయి. ఇంతకు మునుపు ఏ పత్రికలో కానీ, సామాజిక మాధ్యమాలలో కానీ ప్రకటించబడి ఉండరాదు. పూర్వం ఏ మాధ్యమంలోనైనా ప్రచురితమైందనే విషయం, నిర్వాహకుల దృష్టికి వస్తే, బహుమతి ప్రదానాల పిమ్మట నైనా, తగు చట్టపరమైన చర్యలు చేపట్టబడతాయి.
- పోటీకి నవలలు అందడానికి ఆఖరు తేదీ: రానున్న సంక్రాంతి పర్వదినం (15, జనవరి,2025)
- బహుమతి పొందిన రచనలు ప్రచురిస్తే, విధిగా మొదటి అట్ట వెనుక భాగంలో స్వ. జొన్నలగడ్డ రాంభొట్లు- సరోజమ్మల చిత్రంతో పాటు బహుమతి వివరాన్ని ప్రకటించవలసి ఉంటుంది.
- పోటీలకు సంబంధించి ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు, సంప్రదింపులు జరుపబడరాదు.
- సిరికోన సభ్యులు కాని వారు కూడా ఈ పోటీలో పాల్గొనవచ్చు.
వీలైనంత ఎక్కువ సంఖ్యలో రచయిత(త్రు)లు పాల్గొనాలని అభ్యర్థిస్తున్నాము.
ఏదైనా ఇతర సమాచారం నిమిత్తం క్రింది వారిని సంప్రదించవచ్చు:
(అ) జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం # +1 (214)- 621- 1790 subbujvr@gmail.com
(ఆ) ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ # +1 (341)-356-1093 gangisetty.ln@gmail.com
― సిరికోన (Silicon Academy of Letters)