Site icon Sanchika

సిరికోన – శ్రీమతి రుక్మిణమ్మ గంగిశెట్టి స్మారక ఉత్తమ ప్రథమ కవితాసంపుటి కవయిత్రి పురస్కారం ప్రకటన

[dropcap]2[/dropcap]019-2021 మధ్యకాలంలో వెలువరించిన కవయిత్రుల ‘ఉత్తమ’ ప్రథమ కవితాసంపుటికి పురస్కారం ప్రకటన.

~

  1. మరో మాటలో చెప్పాలంటే కవయిత్రుల డెబ్యూ సంపుటికి!
  2. అవి 2019 జనవరి నుంచి 2021 డిసెంబర్ ఆఖరులోగా ‘ముద్రితమై’ ఉండాలి.
  3. పరిశీలనకు పంపే సంపుటి కనీసం ముద్రణలో 80 పుటలు ఉండి తీరాలి. (ముందు మాటలు, అభినందన వగైరాలు కాకుండా. కేవలం కవితలు మాత్రమే.)
  4. ‘ముద్రిత సంపుటాలు’ వెలువరించలేని వారు పాల్గొంటూంటే, కనీసం 80 పుటలు రాగలిగే ముద్రిత కవితల జిరాక్స్ ప్రతులనైనా పంపవచ్చు. అయితే అవి కూడా పై మూడేళ్ళ కాలపరిమితిలోనే ఏవైనా ‘పత్రికలలో’ మాత్రమే ముద్రితమై ఉండాలి.
  5. ఇది ప్రతి ఏటా ఇచ్చే అవార్డు. 2019లో వచ్చిన కవయిత్రి డెబ్యూ సంపుటికి 20 లోనే ఇవ్వాలి. అయితే కరోనా చాలా వాటిల్తో పాటు కాలాన్ని కూడా మింగేయడంతో, 20 లోనూ, 21 లోనూ ముద్రణ కార్యక్రమం బాగా కుంటుపడడంతో, ఈ రెండేళ్ల కాలాన్ని కూడా కలిపి మొత్తం మూడేళ్ళ కాల పరిధిలో వచ్చిన ఉత్తమ కవితా సంపుటికి ఇద్దామని కమిటీ సభ్యులు నిర్ణయించారు.
  6. కాలావధి పెంచడం వల్ల, ప్రధానమైన ఉత్తమసంపుటి అవార్డుతో పాటు మరొకటి/లేదా రెండు అర్హమైన ఇతర ఉత్తమ రచనలకు కూడా ప్రత్యేక పురస్కారాన్ని ప్రకటించే అవకాశం కమిటీకి ఉంటుంది.
  7. ఉత్తమ కవితా సంపుటిగా ఎంపికయ్యే రచనకు రూ.10000 (పదివేల రూపాయల) నగదు పురస్కారం, స్మారిక,పట్టు వస్త్రాలతో సముచిత సత్కారం ఉంటుంది (కరోనా పీడన లేకుంటే హైదరాబాద్‌లో మార్చి-ఏప్రిల్ నెలల్లో జరిపే సిరికోన సాహిత్యోత్సవంలో సత్కారముంటుంది. లేదంటే జూమ్ సమావేశంలోనే!)
  8. ప్రత్యేక పురస్కారానికి ఏవైనా ఎంపికైతే రూ.5000 (ఐదువేల రూపాయల) నగదు పురస్కారం, స్మారిక అందించబడుతుంది.
  9. రచనలు రెండు ప్రతులను పంపాలి. అందాల్సిన ఆఖరు తేదీ: 5 జనవరి 2022
  10. రచనలు పంపవలసిన చిరునామా:  D.Veenavani, Flat No.502, Suja Celestia Apartment, Road No.21, Narsingi, Rangareddy, Hyderabad 500089, దూరవాణి: 9951331122
  11. పై చిరునామాకు రెండు ముద్రిత ప్రతులు పంపుతూ, ఈక్రింది ఐ.డి.కి pdf ప్రతిని ఈమెయిల్ చేస్తే మరింత హర్షదాయకంగా ఉంటుంది. (Pdf ప్రతులు పూర్తి కాన్ఫిడెన్షియల్ గా ఉంచబడతాయి) gangisetty.ln@gmail.com
Exit mobile version