సిరివెన్నెల

    0
    2

    [dropcap]చి[/dropcap]త్రసీమలో విరిసిన సిరివెన్నెల
    సాహితీ గగనంలో చందమామ
    పాటల విరితోటలో పారిజాతం
    సీతారామశాస్త్రి కలం చంద్రహాసం

    అమరావతిలో శచీపతి పాటల పోటీ
    పెట్టాడేమో, నేను వస్తా పాట రాస్తా
    అంటూ రివ్వున నింగికెగిరిపోయాడు
    కలం రెక్కలు విప్పుకొని కలహంసలా

    పాటలరేడు మరి లేడు ఇక రాడు
    ఇది చిత్రసీమ దౌర్భాగ్యమా
    దివిసీమ చేసుకున్న పుణ్యమా
    సిరివెన్నెల అమరుడు వాణీ కొమరుడు

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here