Site icon Sanchika

సీతాకోకచిలుకలు

[డా. కందేపి రాణీప్రసాద్ గారి ‘సీతాకోకచిలుకలు’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]పి[/dropcap]ల్లలూ! రంగు రంగుల సీతాకోకచిలుకలు అంటే మీకు ఇష్టం కదా! మీకేనా పెద్దవాళ్ళకు కూడా ఇష్టమే. మరి అవి అంత అందంగా ఉంటాయి. అందమైన పూలపై వాలుతూ రెక్కలల్లార్చుకుంటూ తిరుగుతుంటే చూడటానికి ఎంత ముద్దుగా ఉంటుంది. మీరు స్కూలు ఫంక్షన్లలో ఫేస్ పెయింటింగ్, బాడీ పెయింటింగ్ వేసుకుంటున్నారు కదా! మరి సీతాకోక చిలుకలు ఈ ఫ్యాషన్ గురించి ఎప్పుడో తెలుసుకొచి తమ ఒంటి నిండా రంగులు వేసుకున్నాయి కదూ!

సీతాకోకచిలుకలు ‘ఇన్‌సెక్టా’ విభాగానికి, ‘లెపిడోప్టీరా’ క్రమానికి చెందిన ఇన్‌సెక్ట్స్. సీతాకోకచిలుకలు నాలుగు దశల జీవిత చక్రాన్ని కలిగి ఉంటాయి. గుడ్లు, లార్వా దశల్లో ఆకులపై ఉండి వాటిని ఆహారంగా తీసుకుంటాయి. గొంగళిపురుగు దశలో నల్లగా, వెంట్రుకలలలో అసహ్యoగా ఉంటుంది. అదే సీతాకోకచిలుకగా మారిన తరువాత ఎంతో అందంగా ఉంటుంది. సీతాకోక చిలుకలు తల, మెడ, పోట్ట అంటూ మూడు భాగాలుగా విడగొట్టబడి బలమైన దవడలు కలిగి ఉంటుంది. పొట్ట పది ఖండితాలుగా విడగొట్టబడి మూడు జతల కళ్ళలో ఉంటుంది. ఇది అతుకులు గలిగిన కాళ్ళు గల కీటకాలు.

ప్రపంచవ్యాప్తంగా ఇవి 18,500 జాతులు ఉన్నాయి. ఒక్క అంటార్కిటికాలో తప్ప ప్రపంచమంతా సీతాకోకచిలుకలు వ్యాపించి ఉన్నాయి. ఇవి ఎంతో దూరాలు వలసపోతుంటాయి. ‘బ్రిటిష్ పెయింటెడ్ లేడీ’ సీతాకోకచిలుకలు దాదాపు 9000 మైళ్ళు దూరం వలస పోతుంటాయి. గుడ్డు, లార్వా, ప్యూపా దశల్లోనే ఇవి ఎక్కువకాలం బతుకుతాయి. సీతాకోకచిలుకగా మారిన తర్వాత ఒక వారం నుండి సంవత్సరం వరకు వీటి ఆయుష్షు ఉంటుంది.

సూర్యరశ్మి పుష్కలంగా లభించే ప్రాంతాలలో సీతాకోకచిలుకలు ఎక్కువగా ఎగురుతాయి. అదీ పూల చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో సీతకోకచిలుకలు వాలతాలయని మనకు తెలుసు కదా! పూల చెట్లుకు పురుగు మందులు కొట్టినపుడు సీతకోకచిలుకలు కూడా చనిపోతాయి. సీతాకోకచిలుకల్ని రక్షించడానికి భారతదేశంలో ఎన్నో చోట్ల పార్కులు ఏర్పాటు చేయబడ్డాయి ఈ బటర్‌ఫ్లై పార్కులు చాలా అందంగా ఉంటాయి. నేను సింగపూర్ లోని బటర్‌ఫ్లై పార్కును చూసి చాలా సంతోషపడ్డాను. అలాగే అధిక దిగుబడిగా పూలనిచ్చే బెంగుళూరు లోని బటర్‌ఫ్లై పార్కును కూడా చూశాను. ఇంకా దేశంలోని మిగతా పార్కుల్ని చూడాలి. ప్రకృతిలో ఉన్న రంగులన్నీ చిన్న చిన్న ముక్కలుగా తుంచి ఎగుర వేస్తుంటే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది. బటర్‌ఫ్లై పార్కులు వర్ణ సమ్మిళితాలు.

బెంగుళూరు సీతకోకచిలుకల ఉద్యానవనం

2007లో బెంగుళూరులో సీతకోకచిలుకల ఉద్యానవనం ఏర్పాటు చేసిన తర్వాత సిమ్లాలో కూడా ఉద్యానవనాన్ని 2008లో ఏర్పాటు చేశారు. సిమ్లాలో 4.2 హెక్టార్ల విస్తీర్ణంలో ఉద్యానవనాన్ని ఏర్పాటు జేశారు. ఇక్కడ 300 రకాల సీతాకోకచిలుకలు ఉన్నాయి. చండీఘర్‌లో ఉన్న బటర్‌ఫ్లై గార్డెన్‌లో పేర్లు రాసిన ఛార్ట్ డిస్‌ప్లేలతో ఉంటాయి. ఎన్ని రకాల బటర్‌ఫ్లైలు ఉన్నాయో, వాటి పేర్లెమిటో మనకు తెలుసుకునే అవకాశం కలుగుతుంది ఇందులో ఎన్నో రకాల పూల చెట్లకు ఎండ తగలకుండా షెడ్లు వేసి ఉన్నాయి. ఎక్కువ గాలులు తగలకుండా సీతాకోక చిలుకలను కాపాడుకోవాలి. ఢిల్లీ లోకి కన్జర్వేషన్ ఎడ్యుకేషన్ సెంటర్ అధ్వర్యంలో బటర్ ఫ్లై పార్కు ఉన్నది.

ఇది అసోలా భట్టి వన్యప్రాణుల రిజర్వ్ వద్ద ఈ శోభాయమానంగా సీతాకోకచిలుకలకు నిలయంగా ఉన్నది. ఇందులో కేవలం 90 జాతుల సీతకోకచిలుకలు మాత్రమే ఉన్నాయి కానీ పూలు, చెట్లు 250 జాతుల దాకా ఉన్నాయి. పూల చెట్లు మాత్రమే కాక పక్షులు, జంతువులు, సరీసృపాలు వంటివి కూడా ఉన్నాయి.

సిక్కింలో చూడవలసిన ప్రముఖ ప్రదేశాలలో బటర్‌ఫ్లై రిజర్వ్ పార్కు కూడా ఒకటి. నేను సిక్కింలో ఉండే సీతాకోకచిలుకల చార్టులను తయారు చేసి మా ఆసుపత్రిలో ఉంచాను. ఇక్కడి వాతావరణం, వృక్షసంపద, అసాధారణ భౌగోళిక ప్రవేశం, గాలులు అన్నీ కూడా సీతాకోకచిలుకలకు అనువుగా ఉంటాయి ప్రపంచం మొత్తం లోనే సీతాకోకచిలుకలకు అనుపైన ప్రదేశం సిక్కిం రాష్ట్రమే. ఇది 2011 లో స్థాపించబడింది.

గోవాలో ఉన్న బటర్‌ఫ్లై కన్జర్వేటరీ పార్కు కూడా దాలా ఆకర్షణీయంగా ఉంటుంది తడి అధికంగా ఉండే నేల ఇసుక, గాలి ఇక్కడి సీతాకోకచిలుకలకు బాగా నచ్చుతాయి. నేను గోవా చాలాసార్లు వెళ్ళినా కూడా ఈ పార్కును చూడలేక పోయాను ఇక్కడి ఉష్ణోగ్రత సీతాకోకచిలుకల పునరుత్పత్తికి బాగా సరిపోతుంది.

థానే లోని ఓవలేకర్ వాడి బటర్‌ప్లై పార్కులో సీతాకోక చిలుకలు ఏడాది పొడవునా ఉంటాయి. ఇక్కడ 132 జాతుల సీతాకోకచిలుకలు ఉన్నాయి. ఇక్కడ సీతాకోకచిలుకల జీవిత చరిత్ర లోని అన్ని దశలనూ చూడవచ్చు. కళ్ళకు మిరుమిట్లు గొలిపే సీతాకోకచిలుకల అందాన్ని చూసి తీరవలసిందే.

నేడు అంతరించిపోయే దశలో ఉన్న సీతాకోకచిలుకల బొమ్మలను తీసుకుని చార్టులు తయారు చేశాను. వీటిలో సిక్కిం, అరుణా చలప్రదేశ్, మేఘాలయ, కుమావ్ ప్రాంతాలలో ఉన్న సీతాకోకచిలుకలు ఉన్నాయి. జీవాదరణ వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉంది అని చెప్పడానికి సీతాకోకచిలుకలు ప్రకృతిలో తిరుగుతున్నదానిని కొలమానంగా తీసుకుంటారు. Cupha Erymanthis, Graphium Sarpedon, Cyristus Rusca, Euploea Mulciber, Altophaneura Dasarada, Cetosia Beblis మొదలైన జాతుల సీతాకోకచిలుకలు హిమాలయ ప్రాంతాలలో జీవిస్తున్నాయి. ఇవి అన్ని కూడా విలుప్తమయే దశలో ఉన్నాయి. వీటన్నింటిని కాపాడుకోకపోతే ప్రపoచం రంగుల్ని కోల్పోతుంది సీతాకోకచిలుకల వలననే ప్రకృతికి గ్లామర్ పెరుగుతుంది. ఛాయా చిత్రకారులు, చిత్రకారులు, ప్రకృతి ప్రేమికులు, దార్శనికులు, కవులు, కళాకారులు అందరూ సీతాకోకచిలుకల అందానికి ముగ్ధులయ్యేవారే. ప్రస్తుత కాలుష్య వాతావరణం వలన సీతాకోకచిలుకలకీ ముప్పు ఏర్పడుతోంది. ప్రపంచాన్ని రంగులమయం చేసే ఆకర్షణీయ సీతాకోకచిలుకలు అంతరించిపోకుండా మనం కాపాడుకోవాలి.

Exit mobile version