Site icon Sanchika

స్మృతి రత్నాలు

[dropcap]జీ[/dropcap]విత సంధ్యా సమయంలో
ఒకరోజు వయసు
గుండెలో జ్ఞాపకాల
జేబును తడిమింది

అవశేషాల్లా బయటపడ్డవి
విరిగిన కలల గాజు ముక్కలూ
వాడిన ఆశల గులాబీ రేకులూ
రాలిన కోరికల ఆకులూ

చెక్కు చెదరక దొరికినవి
ఆనందంగా
అమాయకంగా
గడిపిన బాల్య స్మృతి రత్నాలు.

Exit mobile version