[ఏప్రిల్ 23 ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ‘స్నేహాలయం’ అనే కవితని అందిస్తున్నారు శ్రీమతి పుట్టి నాగలక్ష్మి.]
[dropcap]అ[/dropcap]దో పఠనాలయం
అందరికీ మిత్రాలయం
వేలాది పొత్తాలు
మదినలరిస్తాయి
వందలాది పుస్తకాలు
జ్ఞానాన్నందిస్తాయి
ఆప్యాయతను పంచి
ఒడిని చేరి
చేయూతనిచే
గ్రంథాలయమే
వ్యాకులపడే మనసుకి
నూతనశక్తి నిచ్చే
స్నేహాలయం