[dropcap]ఆ[/dropcap]స్తులు అంతస్తులు చూసి చేసేది కాదు..
లాభ నష్టాలు బేరీజు వేసుకుని చేసేది కాదు.. స్నేహమంటే!
మమతానురాగాలకు నిలయం..
గౌరవవాత్సల్యాలకు ప్రతిరూపం.. స్నేహం!
ఈ సృష్టిని నడిపించే చైతన్యం.. స్నేహం!
ధరణిని ఏలే రారాజుకైనా వుండవలసిన తొలిలక్షణం.. స్నేహస్వభావం!
అందుకే నేస్తం..
అందరికీ స్నేహహస్తం అందించు..
స్నేహ మధురిమలు నలుదిశలా విస్తరించేలా..
జగతి అంతా స్నేహభావనలతో వర్థిల్లేలా..
స్నేహ సౌరభాల పరిమళాలు విరియాలని తపించి ..
ఆత్మీయ నేస్తాల పలకరింపులతో హాయిగా తరించు!