సుప్రసిద్ధ రచయిత్రి ప్రసూన రవీంద్రన్ గారి కలం నుంచి జాలువారిన “స్నిగ్ధమధుసూదనం” అనే నవలని సరికొత్త ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము.
జీవితం పరిపూర్ణమవ్వాలంటే రెండు సగాలు కలవాలి. ఆ రెండో సగం మనకి ఎదురుపడాలి…
ఒక్కోసారి కొన్ని సాధ్యమావడానికి ఏ మార్మిక లోకాలో తెరుచుకుని, నక్షత్ర ధూళి చెలరేగి, గ్రహాల స్థితిగతులను మార్చేలా కుంభవృష్టి కురిసేలోపు … ఇక్కడ ఈ లోకం శతాబ్దాలను లెక్కించి ఉండొచ్చు…
ఆమె ఒక టెకీ. చిత్రకళ ఆమె ప్రవృత్తి. అబ్బురపరిచే చిత్రాలెన్నో ఆమె కుంచె నుంచి పుట్టాయి. అయినా ఆమెలో ఏదో తెలీని తపన. తన చిత్రాల్లో ప్రాణం లేదంటుంది.
అతను చిన్ననాటి నుండీ చిత్రకళను శ్వాసిస్తూ పెరిగాడు. చిత్రకళలో సమస్త మెళకువలు తెలిసినవాడు. కానీ తానుగా ఒక్క చిన్న గీతని కూడా గీయలేడు.
జన్మాంతర రహస్యాలు బ్రద్దలయ్యేలా ఏ తలుపులు తెరుచుకున్నాయి?
ఆసక్తి చదివించే ఈ ధారావాహిక వచ్చే వారం నుంచి.