[dropcap]సూ[/dropcap]ర్య గోళమా
వెలుగుల తేజమా
నీవు దేవుడివి అవును కాదని
వాదులాడు కుంటున్నారు కానీ
నీవు లేకపోతే
మాకు వెలుగే లేదు
మాకు పగలే రాదు
మా పనులకు ఆధారం
మా కళలకు సాకారం
మా జీవన సాఫల్యం నీవే… నీవే
అగ్ని గోళమై నిప్పులు
కురిపించి చమటలు కార్పించి
మా వలవలు విప్పిస్తావ్
నీవు స్వాహా చేసిన నీరే
భూమి పై కుమ్మరించి
పాడి పంటలు సమృద్దిగ కలిగిస్తావ్
సోలార్ సో యు ఆర్ ది లార్డ్ ఆఫ్ ది వరల్డ్