[శ్రీ కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రచించిన ‘సౌందర్య రాశి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ప్రి[/dropcap]యా..!
ఆకాశపు ఉద్యానవనంలో
కుసుమ తారలను కోసి
నీ సిగలో తురమాలని తెస్తే
వెండి వెన్నెల లాంటి
నీ మోమును చూసి
తారలు వెలవెల పోయాయి
కోయిల రాగాలను మాలలు చేసి
నీ మెడలో అలంకరించాలని వస్తే
నీ శంఖం లాంటి కంఠం చూసి
మాలలు చిన్నబోయాయి
గులాబి రేకులతో నీ అధరాలపై
తేనె సంతకం చేద్దామని చూస్తే
తడిఆరని ఎర్రటి నీ పెదాలను చూసి
గులాబీలు అసూయతో వాలిపోయాయి
ప్రియా..! అంతటి సౌందర్య రాశివి నీవు
నా హృదయ సామ్రాజ్యానికి రాణివి నీవు
నీతోనే నా గమనం.. పయనం.. జీవనం