[dropcap]నే[/dropcap]ను ఎంత డబ్బు, fees, donation కట్టి అయినా సరే మా అబ్బాయిని ఒక మంచి స్కూల్ లో join చేద్దామని రాష్ట్రం అంతా తిరిగాను.
జలగల్లా పిల్లల దగ్గర ఫీజులు పీక్కుతినే కార్పొరేట్ స్కూల్ల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాను.
కానీ
ఎక్కడ మా అబ్బాయికి అడ్మిషన్ దొరకలేదు, సీటు ఇవ్వలేదు.
చివరికి ఎమ్మెల్యేల చేత ఎంపీల చేత కూడా రికమండేషన్ చేయించాను.
అయినప్పటికీ వాళ్లందరూ మా వల్ల కాదు అని చేతులెత్తేశారు.
మీ అబ్బాయికి చిన్నప్పటినుండి ఐఐటి ఒలింపియాడ్ నేర్పిస్తాము, NEET and gate coaching ఇస్తాము,
special course లు నేర్పిస్తాము అంటున్నారు.
పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ నేర్పిస్తాము, కంప్యూటర్ coding నేర్పిస్తాము, రోజు slip test లు పెడతాము,
డ్రాయింగు, సంగీతం, యోగా, కరాటే, డాన్స్ నేర్పిస్తాము అంటున్నారు.
యూనిఫామ్, సాక్సులు, బూట్లు, బెల్టులు, పుస్తకాలు, పెన్నులు అన్నీ మా దగ్గరే మేం చెప్పిన ధరలకే కొనాలని బలవంతం పెడుతున్నారు.
కానీ
మేము అడిగిన ఒక సబ్జెక్టు మాత్రం మా దగ్గర లేదు అంటున్నారు.
నాది చాలా చిన్న కోరిక, ఖర్చు లేని కోరిక.
అది ఏంటంటే –
“మీ స్కూల్లో మా అబ్బాయికి చదువుతోపాటు సంస్కారం కూడా నేర్పిస్తారా” అని అడిగాను.
కానీ ఎవ్వరూ నోరు మెదపలేదు.
దానికోసం ఎంత fees అయిన కడతానని చెప్పాను.
చెప్పండి ఇండియాలో అలాంటి స్కూల్ లో ఏదైనా ఉంటే నాకు చెప్పండి.
సంస్కారం కూడా ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టి ఒక టీచర్‌ని పెడితే బాగుండు.
‘అప్పుడు దానికి కూడా స్పెషల్ ఫీజ్ అంటారేమో!!!!’