(పిల్లల కోసం స్ఫూర్తిదాయక మహిళల కథలను అందిస్తున్నారు శ్రీమతి డి. చాముండేశ్వరి.)
రఖ్మాబాయి రౌత్
[dropcap]C[/dropcap]ovid pandemic waves తగ్గుముఖం పట్టాయి. దేశంలో మెజారిటీ ప్రజలకు టీకాలు అందాయి. పిల్లలకు టీకాలు వేస్తున్నారు. తగిన జాగ్రత్తలతో తిరిగి నార్మల్ లైఫ్ లీడ్ చెయ్యటం స్టార్ట్ అయ్యింది. స్కూల్స్‌తో సహా అన్ని తిరిగి ప్రారంభం అయ్యాయి.
పిల్లలు ఉత్సాహంగా physical గా ఫ్రెండ్స్, టీచర్లని కలిసి క్లాస్‌రూమ్‌లో చదువుకోవటానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితిలో నెలల తరబడి ఆన్లైన్ క్లాఅసులు, టివి, ఆటలు అలవాటు పడిన కొద్దిమంది పిల్లలు ఇంకా ఆన్‌లైన్ క్లాసులు ఉంటే బాగుండు అనుకుంటున్నారు. అందులో సాత్విక ఒకరు.
‘అబ్బా! పొద్దున్నే లేచి రెడీ అయ్యి స్కూల్‌కి వెళ్లాలా? హోమ్ వర్క్, ట్యూషన్. అమ్మ చెప్పే రూల్స్. ఓహ్! నో!’ అనుకుంది సాత్విక మెలకువ వచ్చినా లేవకుండా.
“సాత్విక! సాత్విక! గెట్ అప్! స్కూల్‌కి లేట్ కావద్దు.” అంది అమ్మ.
“అమ్మా! ఇంకో పది నిమిషాలు పడుకుంటాను. ప్లీజ్” అంది సాత్విక
“నో! వన్ మినిట్ అంతే!” అంది అమ్మ కోపంగా.
విస్సుగా లేచి, స్కూల్‌కి రెడీ అవుతున్న సాత్విక “అమ్మా! నేను ఇంట్లోనే హ్యాపీగా చదువుకుంటాను. ఐ డోంట్ వాంట్ టు గో.” అంది.
“ఆహా! Study from home చేస్తావా? అర్ యు మాడ్? హ్యాపీగా స్కూల్‌కి వెళ్లి ఎప్పటిలా చదువుకో. లేజీగా ఉండొద్దు” అంది అమ్మ.
“నో నేను వెళ్ళను. డోంట్ ఫోర్స్ మీ. అయినా మమ్మీ, చదవకపోతే ఏమవుతుంది? ఎందుకు చదవాలి? బోరింగ్” అంది సాత్విక విసుగు మొహం పెట్టి.
“సాత్వికా!” అని గట్టిగా అరుస్తూ వచ్చిన అమ్మని అమ్మమ్మ ఆపారు.
“సాత్వికా! నా బంగారు. స్కూల్‌కి ఎందుకు వెళ్లి చదువుకోవాలి? అడిగావు కదా? సాయంత్రం నువ్వు స్కూల్ నుండి వచ్చాక inspiring women like first doctor, police judge, engineer గురించిన స్టోరీస్ చెబుతా” అన్నారు అమ్మమ్మ.
“ఫస్ట్ డాక్టర్? స్టోరీ చెప్పు” అంది సాత్విక.
“నాట్ నౌ! ఆఫ్టర్ స్కూల్. ఈవెనింగ్. నౌ యు గో. స్కూల్ బస్సు వస్తోంది” అన్నారు అమ్మమ్మ
కథ మీద ప్రేమతో సాత్విక “ఓకే” అంటూ స్కూల్ బస్సు కోసం పరిగెత్తింది.
***
సాయంత్రం అమ్మమ్మ కథ అంటే.. రియల్ లైఫ్ స్టోరీ చెప్పటం మొదలుపెట్టారు. విందామా?
“సాత్వికా! నువ్వు, మీ అమ్మ, నేను చాలా లక్కీ.”
“ఎందుకు అమ్మమ్మా?”
“నీకు గుర్తుందా? కొన్ని రోజుల క్రితం టీవీలో ఒక చైల్డ్ మ్యారేజ్ ఆపిన వార్త వచ్చింది, పెళ్లి కూతురే పోలీస్‌కి రిపోర్ట్ చేసిందని.”
“ఆ! గుర్తుంది. పాపం. దట్ గర్ల్ వాంటెడ్ టు స్టడీ, డాక్టర్ అవుతా అంది కదా?” అంది సాత్విక.
“అవును. బేబీ! 2022లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటే 1800+ సంవత్సరాలలో ఇంకెలా ఉండేదో ఆలోచించు” అన్నారు అమ్మమ్మ.
“No. I can’t. 100 ఏళ్ళ క్రితం ప్రజలు ఎలా ఉండేవారు? నీకేమి తెలుసు?” అంది సాత్విక
“నాకు తెలీదు. కానీ మా అమ్మమ్మ చెప్పారు. నా 60 ఏళ్ళ జీవితంలో స్త్రీల జీవితంలో చదువు తెచ్చిన మార్పులు చూసాను. 100-150 ఏళ్ళ క్రితం అందరికి చదువు ఉండేది కాదు. బాగా ధనవంతులకి, మగపిల్లలకి మాత్రం వీలు అయ్యేది. అలాంటి పరిస్థితిలో ఒక అమ్మాయి ధైర్యంగా నేను మగపిల్లతో పాటుగా స్కూల్‌కి వెళ్లి చదువుకుంటా అని అడిగి, పోరాడి ఇండియాలో ఫస్ట్ ఎండీ చదివిన వుమన్ డాక్టర్ అయింది తెలుసా?”
“అవునా? చదువు కోసం ఎందుకు పోరాడింది?”
“ఎందుకంటే అప్పట్లో గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్‌ని ఇష్టపడేవాళ్లు కాదుట. ఇప్పటికి మన దేశంలో చాలామంది అమ్మాయిలు చదువుకు దూరం. 1864లో అప్పటి బాంబే (నేటి ముంబయి) లో రఖ్మాబాయి జన్మించారు. ఆమె తల్లి భర్తని పోగుట్టుకున్నారు. రుఖ్మా బాయికి అబ్బాయిలతో పాటుగా స్కూల్‌కి వెళ్లి చదవాలని కోరిక. పాపం నాన్న లేరు. కుటుంబంలోని మిగతావారు ఒప్పుకోలేదు. అయినాసరే అమ్మని ఒప్పించి స్కూల్‌కి వెళ్ళేది. ఆ రోజుల్లో ఆడపిల్లలకి చిన్నవయసులో పెళ్లి చేసేవారు. 8-9 ఏళ్ళకి. అంటే నీ వయసుకి” అన్నారు అమ్మమ్మ.
“వాట్? నా ఏజ్ గర్ల్ కి పెళ్ళా? అమ్మమ్మ! What is pelli? నాకు కూడా పెళ్లి చేస్తారా?” అంది భయంగా సాత్విక.
“నో నో! భయపడకు. నీకేమి కాదులే. నువ్వు చదువుకుంటున్నావుగా. విను. అలా, రుఖ్మా బాయి వద్దని ఏడుస్తున్నా, ఇంట్లో పెద్దలు బలవంతంగా పెళ్లి చేసారు. భర్త వయసు ఎక్కువ. 30-40 సంవత్సరాల మధ్యలో ఉంటుంది”.
“ఓహ్ గాడ్! అదేంటి? తప్పుకాదా?”
“పాపం రఖ్మాబాయికి 11 ఏళ్ల వయసులోనే పెళ్లి చేశారట. అయితే ఆమె ఎప్పుడూ ‘భర్తతో ఉండను చదువుకుంటా’ అని తల్లితో పాటు తన పుట్టింట్లోనే ఉండేది. ఆ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదు. చదువుకోవాలనే కోరిక. అమ్మ దగ్గరే ఉంటూ ఫామిలీని, అంకుల్‌ని ఒప్పించి అతని సాయంతో చదువుకుంది. అది భర్తకీ, ఇంకా ఊర్లో వేరేవాళ్లకు నచ్చలేదు. ఆడపిల్లలకి చదువు అవసరం లేదు. ఇంటి పనులు చూసుకోడం వస్తే చాలు అనేవారట. ఇంట్లో పనిచేస్తే చాలు. బైటకి వెళ్ల కూడదు, అనేవారట.”
“అమ్మమ్మ! It’s not good. They are bad” అంది సాత్విక.
“కదా? పాపం ఆ అమ్మాయి అందర్నీ ఎదిరించి చదువుకుంది. కానీ భర్తకి నచ్చక 1887లో ఆమె తన ఇంటికి రావాలి అని ఆమె భర్త దాదాజీ భికానీ కోర్టుకు వెళ్లారు. అయితే తన అనుమతి లేకుండానే తనకు బలవంతంగా పెళ్లి చేశారని ఆమె కోర్టులో వాదించారు. కోర్టు ఆమెకు రెండు ఆప్షన్లు ఇచ్చింది. భర్త దగ్గరకు వెళ్లాలని లేదా ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాలని. దీంతో భర్తతో ఉండేకంటే జైలుకు వెళ్లేందుకు సిద్ధమని రఖ్మాబాయి తెగేసి చెప్పారు. ఆ సమయంలో అదొక పెద్ద సాహసమనే చెప్పాలి. తన పెళ్లిని రద్దు చేయాలంటూ ఆమె క్వీన్ విక్టోరియాకు ఉత్తరం రాశారు. అప్పుడు ఆ కోర్టు తీర్పును రాణి రద్దు చేశారుట.”
“Wow! క్వీన్ అఫ్ ఇంగ్లాండ్‌కి లెటర్ రాశారా? గ్రేట్. సో బ్రేవ్”
“అవును సాత్వికా. She was brave. నీకు తెలుసా? రఖ్మాబాయి తనలాగా ఆడపిల్లలకి చిన్న వయసులో పెళ్లి చెయ్యకూడదు అని పోరాడింది. Because of her case and fight బ్రిటిష్ గవర్నమెంట్ మ్యారేజ్ ఆక్ట్ 1891ను ఆమోదించడంతో బాలికల వివాహ వయసు, 10 నుంచి 12 ఏళ్లకు పెంచారు. ఆ రోజుల్లో అదొక గొప్ప విషయం. ఇప్ప్పుడు 21 ఏళ్ళు” అన్నారు అమ్మమ్మ
అది విన్న సాత్విక మౌనంగా ఉండిపోయింది. బహుశా పాతరోజులలో ఆడపిల్లలపై ఇన్ని ఆంక్షలా అని అనుకుంది కాబోలు.
“అమ్మమ్మ! కోర్ట్ కేసు తర్వాత ఆమెకు ఏమైంది?” అని అడిగింది.
“ఏముంది చాలా మంది ఆ అమ్మాయిని తిట్టారు. కొట్టారు. అవమానించారు. అయినా భయపడలేదు. చదువు మానలేదు. లక్కీగా తనకి హెల్ప్ దొరికింది. తన పెళ్లి రద్దు అయిన వెంటనే 1889లో లండన్ స్కూల్ ఆఫ్ మెడిసన్ ఫర్ విమెన్‌లో రఖ్మాబాయి జాయిన్ అయ్యారట. 1894లో ఆమె మెడిసిన్ డిగ్రీ పొందారు. అయితే ఆమె ఎండీ చేయాలని అనుకున్నారు. అప్పట్లో ఆడవాళ్లు ఎండి చేసేందుకు లండన్ స్కూల్ ఆఫ్ మెడిసన్ ఒప్పుకునేది కాదు. ఆ విద్యా సంస్థ నిర్ణయంపై ఆమె పోరాడారు. తర్వాత బ్రసెల్స్‌లో ఆమె ఎండి పూర్తిచేశారు. భారత్‌లో తొలి మహిళా ఎండీ డాక్టర్ రఖ్మాబాయి. అయితే భర్తతో విడాకుల తీసుకున్నందుకు ఆమెను చాలా మంది చిన్నచూపు చూసేవారు. అయినా ఆమె పట్టించుకోలేదు. బాలికా విద్య, స్త్రీ ఆరోగ్యం, స్వేచ్ఛ, బాల్య వివాహాల గురించి ఏమి చేయాలో అందరికి చెప్పేవారు. మహిళల ఆరోగ్యం కోసం ఆమె తన జీవితాన్ని అంకితం చేశారు. 35ఏళ్ల పాటు ఆమె డాక్టర్‌గా ప్రాక్టీస్ చేశారట. ఆమె మళ్లీ పెళ్లి చేసుకోలేదు. తన దగ్గరకు చికిత్స కోసం వచ్చిన పేరెంట్స్‌కి అమ్మాయిలను చదివించాలని, చిన్న వయసులో పెళ్లి చెయ్యకూడదని వివరించేవారట. అమ్మాయిలు చదువుకోవటం చాలా అవసరం అనేవారట. మహాత్మా గాంధీ కూడా అదే నమ్మేవారు. ఒక అమ్మాయి చక్కగా చదువుకుంటే కుటుంబం మొత్తం చదువుకున్నట్లు అవుతుందని చెప్పెవారు. సాత్వికా, 50-60 ఏళ్ళ క్రితం కూడా ఆడపిల్లలు చదువుకోవాలంటే కష్టంగా ఉండేది. ప్రస్తుతం మీ స్కూల్స్ లో మంచి బిల్డింగ్స్, గ్రౌండ్, ఫెసిలిటీస్, ఫుడ్, transport, టీచర్స్, స్పోర్ట్స్, ఆక్టివిటీస్ ఒకటేంటి చాలా ఉన్నాయి మీకు. మరి అప్పటి రోజుల్లో మాకు వన్ రూమ్ వన్ టీచర్ స్కూల్స్. అవి కూడా ఇంటికి దూరం. నడిచి వెళ్ళాలి. లిమిటెడ్ ఫెసిలిటీస్. You know నేను నా తమ్ముళ్లు స్కూల్‌కి నడిచి వెళ్ళేవాళ్ళము. వానాకాలంలో పుస్తకాల సంచీ తల మీద పెట్టుకుని ఈదుతున్నట్లుగా నీళ్ళలో నడిచి వెళ్ళాము. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే మాకు చాలా ఇష్టం. ఎప్పుడు బోర్ అనుకోలేదు. క్లాస్ రూమ్, స్కూల్ ప్రెమిసిస్ క్లీన్‌గా ఉంచేవాళ్ళము. Never felt any shame for keeping the school clean and green. స్కూల్ ఓపెన్ ఏరియా లో కూరగాయలు పండించి, ఫుడ్ ని వేస్ట్ చెయ్యకూడదని నేర్చుకున్నాము. నా క్లాస్‌లో అంటే 5th క్లాస్‌లో ఒక అమ్మాయికి 5 years age లో పెళ్లి అయింది. Now she is a professor” చెప్పారు అమ్మమ్మ.
“అమ్మమ్మా, మీరు స్విమ్ చేసి స్కూల్ కి వెళ్ళారా? wow” అంది సాత్విక
“సాత్వికా! పాత రోజుల్లో అమ్మాయిలం ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఒక గోల్ సెట్ చేసుకుని రీచ్ అయ్యాము. మరి ఇన్ని ఫెసిలిటీస్‍తో మీరెంత బాగా చదవాలి? So, no crying. No tantrums. రోజూ నీకో బ్రేవ్ గర్ల్ స్టోరీ చెబుతాను. ఓకే.”
“ఓకే అమ్మమ్మ. ఇప్పుడు హోమ్ వర్క్ చేసుకుంటాను” అంటూ అమ్మమ్మని గట్టిగా హత్తుకుని ముద్దు ఇచ్చింది.
పిల్లలూ, మన great grandmothers ఎంతో ఉత్సాహంగా చదువుకుని తోటివారికి role models అయ్యారు. నేటి స్త్రీ విద్యకి, స్వేచ్ఛకి ప్రేరణా, పునాదీ వాళ్ళే. అందుకే మీరు బాగా చదివి, మంచి పనులు చేస్తూ ముందుకే వెళ్ళాలి. 200 ఏళ్ళు వెనక్కి కాదు.