(పిల్లల కోసం స్ఫూర్తిదాయక మహిళల కథలను అందిస్తున్నారు శ్రీమతి డి. చాముండేశ్వరి.)
అక్కమ్మ దేవి (నీలగిరి బడగ తెగ మొదటి మహిళా ఎంపీ)
[dropcap]“అ[/dropcap]మ్మమ్మా! ఈ రోజు ఎవరి గురించి చెబుతావు? అబౌట్ ఫస్ట్ విమెన్?” అని అడిగింది సాత్విక.
“తప్పకుండా చెబుతాను. విను. 100 ఏళ్ళ క్రితం నీలగిరి ప్రాంతాలలో ఉన్న బడగ తెగకి చెందిన ఒక గొప్ప మహిళ అక్కమ్మ దేవి గురించి చెబుతాను.
ట్రైబల్ ఏరియాస్‍లో 100 వందేళ్ళ క్రితం విద్య, ఆరోగ్యం లాంటి సౌకర్యాలు లేవు. అలాంటి సమయంలో ఒక ట్రైబల్ ఫామిలీ నుండి ఒక అమ్మాయి ధైర్యంగా చదువుకుని నీలగిరి నుండి ఫస్ట్ ఎంపీగా ఎన్నికవవటం రియల్లీ గ్రేట్.” అంది అమ్మమ్మ
“అమ్మమ్మా! టెల్ మీ మోర్ అబౌట్ హర్” అంది సాత్విక.
“విను. 1918 సెప్టెంబర్ 5న బేరహుట్టి గ్రామంలో మోత గౌడ్, సుబ్బి దంపతులకి అక్కమ్మ జన్మించారు. ఏడుగురు పిల్లలలో అక్కమ్మ రెండవవారు. ఆమె బడికి వెళ్లడానికి చాలా ఇష్టపడేవారు. కానీ అందరి పిల్లల్లా అమ్మకి సాయం చెయ్యాలి, తన తమ్ముడిని ఎత్తుకోవాలి, ఇంటి పనులు చేయాలి వంటి ‘డ్యూటీలు’ ఆమెను అధికారికంగా బడికి పోకుండా అడ్డుకున్నాయి. అయినప్పటికీ, ఆమె తన సోదరుడిని తన ఒడిలో పెట్టుకుని పాఠశాల వెలుపల కూర్చొని రైమ్స్ పాడటం నేర్చుకున్నారు.
కూనూర్‌లోని పాశ్చర్ ఇన్‌స్టిట్యూట్‌లోని ల్యాబ్‌లో పనిచేసిన ఆమె తండ్రి బ్రిటిష్ అధికారులతో మసలుకోవడం వల్ల ఉదారంగా ఆలోచించేవాడట. ఆయన స్త్రీలకి విద్యకి అవసరం అనేవాడట. అక్కమ్మకు చదువుపై ఉన్న ఆసక్తి చూసి, ఆమెను కూనూర్‌లోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్‌లో చేర్పించాలని నిర్ణయించుకున్నాడట. కానీ ఒక సమస్య ఉంది: ఆ పాఠశాలని బ్రిటిష్ మరియు ఆంగ్లో-ఇండియన్ల కోసం ప్రత్యేకంగా పెట్టారు. కాబట్టి, అతను అప్పటి పాశ్చర్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ కార్న్‌వాల్ సాయం అడిగాడు. ఆ స్కూల్‌లో చేరిన ఫస్ట్ ఇండియన్ అక్కమ్మ. ఆమె రోజూ ఐదు మైళ్లు నడిచి బడికి వెళ్ళేవారు.
నువ్వు పక్కన ఉన్న షాప్‌కి వెళ్లి రమ్మంటేనే డాడీని బైక్ మీద తీసుకువెళ్ళమంటావు. నడవవు. నడిస్తే హెల్తీగా ఉంటావు. ఆకలి బాగా వేస్తుంది. టాల్, స్ట్రాంగ్ అవుతావు తెలుసా?” అన్నారు అమ్మమ్మ.
“ఓకే, ఓకే. ఐ విల్ థింక్ అబౌట్ వాకింగ్” అంది సాత్విక.
“సర్లే విను. ఆమె ఎర్నాకుళంలోని సెయింట్ థెరిసా కళాశాలలో ఎకనామిక్స్ చదివారు. కాలేజిలో చేరడానికి కొన్ని రోజుల ముందు, ఆమెకి హుబ్బతలై గ్రామానికి చెందిన ఏస్ క్రీడాకారుడు, ‘రావు బహదూర్’ బిరుదును సంపాదించిన మొదటి బడగ బెల్లి గౌడ్ కుమారుడు జోగితో నిశ్చితార్థం జరిగింది. బహుదూర్ నీలగిరి జిల్లాలో హుబ్బతలైలో ఫస్ట్ హై స్కూల్‌ను నిర్మించారు, ఇది తరువాత అతని జ్ఞాపకార్థం పేరు మార్చబడింది. నేటికీ ఉంది.
అది 2వ ప్రపంచ యుద్ధ కాలం. దేశంలో క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతున్న సమయం. సైనికులు అక్కడే ఉండేందుకు కాలేజీలోని అమ్మాయిలను కొంత కాలం రావద్దని కాలేజి తీసేసుకున్నారు. మిలిటరీ క్యాంపుగా మార్చుకున్నారు. ఇది నచ్చని అక్కమ్మ తన స్నేహితురాలు లీలా మీనన్‌తో కలిసి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్టయ్యారు.
ఈ క్రమంలోనే ఆమె ఆరోగ్యం పాడయ్యింది. ఇంటికి తిరిగి రావాలని అందరు చెప్పినా, ఆమె రాకుండా అన్ని అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేశారట. విద్యని నిర్లక్ష్యం చెయ్యకుండా, పరీక్షలలో మంచి మార్కులతో పాస్ అయ్యారు. బడగ సంఘంలో మొదటి మహిళా గ్రాడ్యుయేట్ అయ్యారు.
పెళ్లి తరువాత కొంత కాలం ఎలాంటి ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉన్నారట. ఆ ఖాళీ సమయాన్ని వృథా చేయలేదు. ఆమె హుబ్బతలైలోని మహిళలకు తోట పని, ప్రాథమిక పారిశుధ్యం, ఇంకా అక్షరాస్యత గురించి నేర్పారు.
1954లో దేశ రాజకీయాల్లోకి వచ్చారు. ‘అక్కమ్మా, నీలగిరి పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?’ అని మద్రాస్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె.కామరాజ్ చెప్పినప్పుడు ఆమె విని, మొదట నమ్మలేకపోయారు. అక్కమ్మ 1,63,420 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ఆమె ఎప్పుడూ విలువల కోసం నిలబడ్డారు. మహిళా శక్తి యొక్క బలాన్ని చూపించారు.
కొండల్లో ఎలాంటి సౌకర్యాలు లేకున్నా బడి, చదువు అంటే చాలా ఇష్టంతో బాగా శ్రమించి First Badaga tribe graduate, ఇంకా MP అయ్యారు.
సాత్వికా! మీకు దొరికిన అవకాశాలు, సౌకర్యాలకి ఇంకెంత చక్కగా చదివి రాణించవచ్చో ఆలోచించు” అన్నారు అమ్మమ్మ.