Site icon Sanchika

శ్రీరామచంద్రుడు

[dropcap]నీ[/dropcap]ల మేఘ శ్యాముడు
అరవింద దళ నేత్రుడు
ఆడినమాట తప్పడు
తండ్రి మాట జవదాటడు
ఒకటే మాట, ఒకటే బాట
ఒకరే ఆలి ఈతని సరళి
పదునాలుగేండ్ల వనవాసం
ముష్కర రక్కసుల సంహారం
ధర్మగ్లాని జరుగనీయడు
శరణన్నవారిని బ్రోచేవాడు
తన సుఖం వదలుకుంటాడు
చపల కోతులను చేరదీసి
సేతువు కట్టాడు సంద్రం దాటాడు
రాశీభూతమైన ధర్మస్వరూపుడు
నవమినాడు సూర్యవంశంలో
ఉదయించిన చంద్రుడు
ఇనకులతిలకుడు శ్రీరాముడు

Exit mobile version