[dropcap style=”circle”]ది.[/dropcap] 14 జూన్ 2018, సాయంకాలం 6 గంటలకు విశాఖపట్నంలోని శ్రీ లలితా పీఠంలో, విశాఖ సాహితి ఆధ్యర్వాన శ్రీమతి కన్నేపల్లి వరలక్ష్మి గారి “శ్రీ లలితా నమోస్తుతే” గ్రంథావిష్కరణ సభ జరిగింది.
సభకు శ్రీమాన్ టి.పి.ఎన్. ఆచార్యులు గారు అధ్యక్షత వహించగా, ఆచార్య సార్వభౌమ శ్రీ వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి గారు ముఖ్య అతిథిగా, కవి గాండీవి శ్రీ ఆత్రేయపురపు పాండురంగ విఠల్ ప్రసాద్ గారు విశిష్ట అతిథిగా సభలో పాల్గొన్నారు. డా. డి. వి. సూర్యారావు గారు (ప్రముఖ సాహితీవేత్త) గ్రంథ సమీక్ష జరుపగా ముఖ్య అతిథి శ్రీ వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి గారు గ్రంథావిష్కరణ చేశారు.
విశాఖ సాహితి కార్యదర్శి శ్రీ ఘండికోట విశ్వనాధం ఆహుతులకు స్వాగతం పలికారు.
సభకు ప్రముఖ సాహితీవేత్తలు శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు, శ్రీ భాగవతుల కృష్ణారావు గారు, “విధి విలాసం” చింతా ప్రభాకరరావు గారు మొదలైన వారు, సాహితీ అభిమానులు, విశాఖ సాహితి సభ్యులు విచ్చేసి సభను విజయవంతం గావించారు.
విశాఖ సాహితి సంయుక్త కార్యదర్శి శ్రీమతి లలిత వాశిష్ఠ గారి వందన సమర్పణతో సభ ముగిసింది.
– ఘండికోట విశ్వనాధం
కార్యదర్శి, విశాఖ సాహితి