[dropcap]అ[/dropcap]నూహ్య సాంకేతికాభివృద్ధితో
దేశదేశాల మనసులు దగ్గరవుతున్నాయి..
అంతర్జాల వేదికలు
ఆమనికి నీరాజనాలర్పిస్తున్నాయి,
వివిధ దేశాల్లోని తెలుగు కోకిలలన్నీ
మధుర గానాలతో మైమరపిస్తున్నాయి..
మానీటర్ పై జాలువారిన కవితలు
మెరుపులవుతున్నాయి..
అందరి రాశులు
అద్భుతంగా వెలుగొందుతున్నాయి..
మానవజీవిత వికాసానికి
ఇంతకంటే ఇంకేం కావాలి?!
శ్రీశార్వరికీ శుభస్వాగతాలు పలకడానికి
సర్వజనులు సంతోషంగా సమాయత్తమయ్యారు
అల్లన మెల్లన రావమ్మా
శ్రీ ‘శార్వరీ’
చీకటనే అర్థాన్నిచ్చినా
అందరి జీవితాల్లో
పండు వెన్నెల పంచాలమ్మా!
అరవై వత్సరాల్లో
నువ్వో తీపి గుర్తుగా మిగలాలమ్మా!
తరతరాలు స్మరించుకోవాలమ్మా!!