శ్రీశ్రీ – మొగ్గలు

0
3

[dropcap]క[/dropcap]లాన్ని ఖడ్గంగా మలచి రుథిరాన్ని సిరాగా పోసి
కార్మికుల పక్షాన నిలబడిన కవి యోధుడు
నిరంకుశ పాలనపై గళమెత్తిన విప్లవ శంఖం – శ్రీశ్రీ

తూటాలాంటి మాటలతో సమస్యలపై పోటెత్తుతూ
కర్షకుల కష్టాలకు బాసటగా నిలిచిన కవి ధీరుడు
పెత్తందారుల కుత్తుకులపై రంపపు కత్తి – శ్రీశ్రీ

పేదరికం లేని మరో ప్రపంచపు వెలుగులకై తపిస్తూ
పేదల పాలిట పెన్నిధిగా నిలిచిన కవి వీరుడు
అణగారిన బ్రతుకులకు ఆశాజ్యోతి – శ్రీశ్రీ

పీడిత,తాడిత జనులకు రక్షణ కవచమవుతూనే
బాధాతప్తులకు భరోసా ఇచ్చిన కవి శూరుడు
దోపిడి దారుల పాలిట సింహ స్వప్నం – శ్రీశ్రీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here