Site icon Sanchika

స్థపతీ! ఓ స్థపతీ!

[box type=’note’ fontsize=’16’] దేవతా మూర్తులకు ఆకారాన్నిచ్చే శిల్పులు కనీస గుర్తింపు నోచుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చివుకుల శ్రీలక్ష్మిస్థపతీ! ఓ స్థపతీ!” కవితలో. [/box]

[dropcap]ఎ[/dropcap]క్కడి శిల్పులయ్యా మీరు?
ఏ యుగం వారు?
ఏ తరం వారు?
మీకో ఊరూలేదు పేరూ లేదు
ఎంత అందంగా చెక్కాడో శిల్పి!!
ఆ! అదే మీ పేరు.
ఆలయాలన్నీ మీవే!
అందలి అందాల
ఆకృతులన్నీ మీవే!
ఎన్ని లక్షల, కోట్ల మందికి కనువిందు చేసాయో!!!
మీ శిల్పాలు!
ఎందరు కనుల
కెమేరాలలో బంధించి
చిత్రాలు గీసారో?
ఎందరు కవులు
కావ్యాలు రాసారో?
కఠినమైన శిలను
శిల్పం చేయడానికి
సజీవ మూర్తులను
మీ ఉలులతో
సృష్టించడానికి
రేయింబవళ్లు
ఎంత శ్రమించారో?
ఆ త్రిభంగి శిల్పాలకు
మీరు పెట్టింది పేరు
ఎంత దీక్షతో
చెక్కుతారయ్యా!
రెప్పవాలిస్తే
మనోదృష్టి చెదిరితే
మొత్తం వృథాయే!
అందుకే
అరవై నాలుగు కళల్లో
మీదే శ్రేష్టం!
మీకు నిత్యం గిరాకీ
ఎందుకా???
మనుషులున్నంత వరకూ
దేవుళ్ళుంటారు
దేవుళ్ళుంటే
ఆలయాలుంటాయి
మరి!
మీరు లేకుండా
ఆలయం లేదుగా!
దేవునికో రూపాన్నిచ్చి
మాముందుంచే
మీరే మా ప్రత్యక్ష దేవుళ్ళు
అని అనరెందుకీ
మనుషులు?????

Exit mobile version