సుమధుర బాల్యస్మృతులు!

0
2

[dropcap]బా[/dropcap]ల్య స్మృతులు మదిలో మెదలగానే..

సంతోషంతో అధరాలపై చిరునవ్వులు వికసిస్తాయి!

వేసవి సెలవుల్లో అమ్మమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు..

తాతయ్య వెన్నెల్లో మంచం పై కుర్చోబెట్టుకుని పిల్లలందరికి చెప్పిన కథలు ..

అమ్మమ్మ వండిన చిరుతిళ్ళు తింటూ “ఊ ..” కొడుతూ వింటున్న.. జ్ఞాపకం!

నానమ్మ ,తాతయ్యలు చెప్పిన “సూక్తులు ..” ..

పెద్దబాలశిక్ష లోని ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ..

ఆగకుండా చదివిన రోజులు ..జ్ఞాపకం !

స్నేహితులతో గిల్లికజ్జాలు అంతలోనే దోస్తీలు ..

కాకి ఎంగిళ్ళ పంపకాలు ..

దొరికిన చెట్టల్లా ఎక్కేస్తూ “కోతికొమ్మచ్చి..” అంటూ అలుపెరగక ఆడిన ఆటపాటలు ..

కాళ్ళు అందకపోయినా సైకిల్ సీటెక్కి.. ఊరిపొలిమేరల్లో, గ్రౌండ్ లో చక్కెర్లు కొట్టి చేసిన అల్లర్లు ..

చెరువు దగ్గర నేస్తాలు అందరం కలసి ఈత కొడుతూ.. కళ్ళు ఎర్రగా మారిపోగా..

నాన్నకి చెప్పొద్దంటూ అమ్మని బ్రతిమిలాడుతూ..

అమ్మ ప్రదర్శించే “చిరు కోపాన్ని” నవ్వేస్తూ పట్టించుకోకుండా..

నాన్న వచ్చేసరికి పుస్తకాలన్నీ ముందేసుకుని ‘పెద్ద చదివేవాడిలా..’ ఫోజిచ్చే సీన్స్..

గుర్తొస్తుంటే భలే జ్ఞాపకాలు ఇప్పటికీ!

చిన్ననాటి సుమధుర జ్ఞాపకాలు.. నేటికీ గుర్తొచ్చినప్పుడల్లా..

మళ్ళోక్కసారి బాల్యం తిరిగొస్తే బావుండనిపించేలా..

పెదవులపై చిరునవ్వు సమ్మోహనం గా కదులుతుంది!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here