సూర్య చక్రిక

0
3

[dropcap]సూ[/dropcap]ర్యుడు జ్ఞానానికి, సృజనకు ప్రతీక. సూర్యోదయంతో పాటు, తల్లి గర్భం లోకి వెళ్లే సూర్యుడు కూడా ఎంతో అందంగా ఉంటాడు. అందులో కన్యాకుమారి వద్ద సముద్రం దగ్గర తల్లి గర్భం లోకి వెళుతున్న సూర్యుడు ప్రకాశవంతంగా, ఎర్రగా ఉండి, మెరుస్తున్న దృశ్యం కళాకారులకీ, సాహితీవేత్తలకు ఎంతో సృజన కల్గిస్తుంది.

సూర్య చక్రిక మంచి ఆర్టిస్ట్. బాల్యం నుంచి చూసింది చూసినట్లు చిత్రిస్తూ ఉంటుంది. చిన్న తమ్ముడు కూడా సూర్య రామ్ కిరణ్ మంచి అందగాడు. అన్నయ్య యశోధర ఇంజినీర్ చదువు చదవాలని అవే విద్యలు విషయాలు నేర్చుకుంటూ ఉండేవాడు. ఒక అన్న, తమ్ముడు మధ్యలో సూర్య చక్రిక. తల్లి తండ్రి వీళ్ళని బాగా ప్రోత్సహించేవారు.

రమణ కాలేజి లెక్చరర్. అది ప్రైవేట్ కాలేజి. జీతం కొంచెం తక్కువైనా, ఒక్కడే కొడుకు కావటంతో అక్కలు ఇద్దరి పెళ్ళిళ్ళు చేసి తల్లి తండ్రినీ చూసే బాధ్యత పెట్టుకొన్నాడు. కొంత పెద్దల అస్తి, ఇల్లు ఉన్నాయి. భార్య సుమిత్ర పెళ్లికి ముందు ఒక్ ఇంగ్లీష్ కాన్వెంట్‌లో టీచర్‌గా చేసేది. అది కూడా చాలా తమాషాగా వచ్చింది.

ముఖ్యంగా పిల్లలకి తల్లి పోలిక వచ్చింది. బాల్యం నుంచే పిల్లలు తల్లి వేసే చిత్రాలు చూసి ముచ్చటపడి నేర్చుకునేవారు. బుద్ధిమంతులు. సాయంత్రం ఇంటికి రాగానే బామ్మ లడ్డూలు కారప్పూస చేసినవి పెట్టేది. అవి తిని పాలు తాగి కాసేపు తాతగారి దగ్గర మాటలు చెప్పి, కథలు విని హోమ్ వర్క్ చేసుకునేవారు. ఒక్కో రోజు చిత్ర లేఖనం తల్లిని చెప్పమని అడిగేవారు. సాయంత్రం మేడ పైకి వెళ్లి ఆకాశాన్ని పరిశీలించమని చెప్పేది. ముందుగా ప్రకృతి పరిశీలన ముఖ్యం అనేది. అలా ఆకాశం వైపు చూస్తూ మేఘాల్లో మార్పులు, పక్షులు ఇళ్లకు వెళ్లే వరుసలు చూసి మురిసిపోయేవారు. వెంటనే డ్రాయింగ్ బుక్ తీసుకుని చిత్రం స్కెచ్ వేసుకుని ఉంచేవారు. వాటికి సరి పడా రంగులు ఎంపిక చేసుకుని కొంచెం కొంచెం రంగులు వేసుకుని ఉంచేవారు. ఆ తరువాత ఆదివారాలు ఉదయం ఆల్పాహరం తిన్నాక ముగ్గురు రంగులు తీసుకుని, స్టడీ టేబుల్‌పై పెట్టుకుని చిత్రాలు వేసేవారు. అలా వారి కృషికి తల్లి సుమిత్ర సహకారం ఉంది. తండ్రి రమణ కూడా పిల్లలు ఏది కావాలంటే అది, రంగులు, డ్రాయింగ్ పుస్తకాలు, డ్రాయింగ్ షీట్స్ రకరకాల చార్ట్‌లు తెచ్చి ఇచ్చేవాడు.

ఒక్క కొడుకు తను. అక్కల పెళ్లిళ్లతో తండ్రి వెనకాల ఉండి అన్ని తెలుసుకున్నాడు. అక్కల పెళ్ళిళ్ళలో కట్నాలు లాంఛనాలు అన్ని ఘనంగా ఇచ్చారు. అయితే అత్తింటివారు “మాకు కట్నం వద్దు మీ పిల్లకి పొలం రూపంలో ఇవ్వండి చాలు, మాకు సరిపడా డబ్బు ఉంది” అని చెప్పారు. అలాగే ఒక్కొక్కళ్ళకీ ఒక్కో ఎకరము భూమి, బంగారం పెట్టి పెళ్లి చేశారు. తండ్రికి పొలం బాగానే ఉంది కనుక ఒక్కగానొక్క కొడుకుని గారంగా పెంచారు. అందుకే తన ఫ్రెండ్ కూతురు సుమిత్రను చేసుకున్నారు. అమె అప్పటికి చేస్తున్న ఉద్యోగం మానెయ్యమన్నారు. “కుటుంబ అవగాహన ఉంటే చాలు, మాకు ఉద్యోగం అవసరం లేదు. అయినా అది ప్రభుత్వ ఉద్యోగం కాదు కదా” అన్నారు. సుమిత్రను ఆలోచించుకోమన్నారు.

సుమిత్ర డిగ్రీ కాగానే పీజీ ప్రైవేట్‌గా చదువుతోంది. మంచి ఆర్టిస్ట్. వస్త్రాలపై చిత్రాలు చిత్రించడంలో మంచి దిట్ట. ఒకసారి రంగులు కొనే నిమిత్తం షాపుకు వెళ్ళింది. అక్కడ రంగులు సెలెక్ట్ చేసుకుని తెచ్చుకొని కౌంటర్ దగ్గరకు వచ్చింది. అక్కడ ఒక ప్రైవేట్ స్కూల్ మేనేజ్‌మెంట్ వారు రకరకాల సరుకులు కొంటు సుమిత్రను పరిశీలించారు.

దగ్గరకు వచ్చాక “మేడమ్ మీరు పెయింట్స్ బాగా సెలెక్ట్ చేసుకున్నారు. మేము డ్రాయింగ్ పెయింటింగ్ టీచర్ కోసం చూస్తున్నాము. మీకు ఇష్టముంటే మేము జాబ్ ఇస్తాము” అని చెప్పారు, “ఇంట్లో చెప్పి చూస్తాను” అన్నది

ఆ తరువాత రంగులకు డబ్బు ఇచ్చి ఇంటికి వచ్చేసింది.

ఈ విషయం ఇంట్లో ఎలా చెప్పాలి, పెద్ద వాళ్ళు ఒప్పుకోరు అని తెలుసు. తను పిజి చేస్తానంటేనే పెద్ద గొడవ చేశారు, హాస్టల్ వద్దు ప్రైవేట్‌గా చదువు అన్నారు. సరే అసలు చదువుకోనిస్తున్నందుకు సంతోషపడింది. అలా రెండేళ్లు చేసింది. తెలుగు నీతి క్లాసులు కూడా చెప్పేది అయితే జీతం నచ్చేది కాదు.

ఒక కార్తీక మాసంలో వన భోజనాల సందర్భంగా సుమిత్ర చాలా యాక్టివ్‌గా పిల్లలకి పెద్దలకి ఆటలు నిర్వహించింది. అప్పుడు రమణ అక్క తల్లి చూశారు. అంతే, ఆ అమ్మాయి గురించి వివరాలు సేకరించి రమణకి తండ్రికి చెప్పారు. అంతా ఆలోచించేసరికి తన స్నేహితుడి కూతురు అని తెలిసి కబురు పంపి పిల్లను చేసుకున్నారు. చిన్ననాటి స్నేహితుడు వియ్యంకుడు అయ్యాడు అని అటు ఇటు కుటుంబాలవారు సంతోష పడ్డారు.

అత్తవారి ఆదర్శానికి సుమిత్ర ఎంతో ఆనందపడింది. అలా తనని చూసి చేసుకున్న వాళ్ల కుటుంబం అంటే గౌరవము.

“పిల్లని కూడా అడగండి” అంటే నవ్వి ఊరుకుంది. “కాదు చెప్పు” అని అమ్మ అంటే… “పెద్దల చాటున పెరిగాను కదండీ, వాళ్ళకే తెలుసు. నా ఇష్టం కంటే పెద్దల అభిప్రాయాలు గొప్పది” అంది. సరే పెద్దల ఇష్టమే తన ఇష్టంగా ఒప్పుకున్నది కాబట్టి పెళ్ళి ఘనంగా చేశారు. ఆడపడుచులకు తండ్రి అన్ని కావాల్సినవి ఇచ్చారు.

‘రమణ భార్య చాలా మంచిది, అందగత్తె, పెళ్ళిలో హరం, నెక్లెస్ సెట్ నల్ల పూసలు ఉంగరం పెట్టారు పుట్టింటివారు. చంద్ర హరం గాజులు పెట్టారు. వంటెడు నగలు అమరాయి. మనకు తగిన కోడలు వచ్చింది. పిల్లలను చదివించి పెంచితే చాలు’ అనుకున్నారు.

ఇంట్లో పెద్ద ఫంక్షన్స్ పండుగలకు వంటమనిషిని పెడతారు. పిండివంటలు కూడా చేయించి డబ్బాలో పెడతారు. కూతురు పిల్లలు కూడా నెలకి ఒకసారి వచ్చి వెడుతూ ఉంటారు. అయితే పిల్లల పెంపకం అంతా బామ్మ తాత చూసుకుంటారు. వాళ్ళు అనాడే డిగ్రీ చదివారు.

రమణ కాలేజి నుంచి వస్తూనే “నాన్నా ఈ రోజు కాలేజిలో అది జరిగింది ఇది జరిగింది” అని చెపుతాడు. ఈలోగా పాలేరు పొలం నుంచి పాలు కూరలు తెచ్చి ఇస్తాడు. ‘అదృష్టం కొద్దీ తనకి చదువు కళలు నేర్చిన భార్య వచ్చింది. ముందు అన్ని బాగా అవగాహన చేసుకుంది. వంటా వార్పుతో పాటు అమ్మ నాన్నని బాగా చూస్తుంది’ అనుకుంటాడు రమణ.

ఇక్కడ ఒక విషయం గమనించాలి. రమణ తల్లి తండ్రి కోడల్ని గారంగా చూసుకుంటారు. అమె మాటని కాదనరు. కారణం ఈ తరం పిల్లల ఆశలు ఆశయాలకి అనుగుణంగా అత్త మామ కాలం గడుపుకోవాలి. కోడల్ని ఆంక్షలు పెడితే ఎలా? పుట్టింటి నుంచి మనల్ని నమ్ముకుని వచ్చిన పిల్లలు!

ఉద్యోగం వద్దు అంటే మానేసింది. ఎలా చెపితే అలా వినడానికి కారణం తాము కూడా ఆ పిల్లని విమర్శించకుండా, విశ్లేషించకుండా జాగ్రత్తగా ఉన్నారు. కొందరు కొడుకులకి కోడలిపై చాడీలు చెపుతారు.  “అబ్బే నువ్వు వెళ్ళాక అది లోపలికి వెళ్లి పోయింది, సరిగ్గా మాట్లాడటం లేదు. మందులు ఇవ్వడం లేదు, కూరలు దానికి నచ్చినట్లు వండుతోంది” అని చాడీలు చెప్పే అత్తలు ఎందరో ఉన్నారు. అంతెందుకు తన అక్క కొడుకులు ఇద్దరు తల్లితో పడలేక ఆమెను వృద్ద ఆశ్రమంలో పెట్టారు. కోడలు వింటుంది కానీ మనమల్ని ఆధునిక వస్త్రధారణ వద్దు అంటూ కేకలేస్తే ఎలా? ఎదిగే పిల్లల వింటారా? రోజు నాన్నమ్మ మాటలు అరుపులు వినలేక ఒక రోజు ‘మేము హాస్టల్ ‌ వెడతాము. మమల్ని చేర్పించి చదివించమ’న్నారు. కానీ ఇద్దరు పిల్లల్ని హాస్టల్‌లో పెట్టి చదివించే కన్నా – తల్లిని హోమ్‌కి పంపడం మంచిదని ఆలోచించి తన అక్కని వృద్ద ఆశ్రమంలో పెట్టారు.

అందుకని రమణ భార్యకు తల్లికి కూడా ఏమాత్రం మాట తేడా రాకుండా చూసుకుంటాడు. మగ పిల్లాడు చూస్తున్నందుకు చాలా మంది ఈర్ష్య పడ్డారు కూడా.

సుమిత్ర మాత్రం తన భర్త సమంగా చూస్తున్నాడు అది చాలు అనుకున్నది. పిల్లలు ఎదిగారు. పెద్దవాళ్ళు ఒద్దికలో పెరిగారు. పెద్ద పిల్లాడు ఇంజినీర్ చదివి ఒక ఛానల్‍లో ఉద్యోగానికి చేరాడు. చక్రిక మాత్రం మెడిసిన్ చదువుతాను అన్నది. ఆడపిల్లకి అన్ని లక్షలు పోసి చదివించేలా అయితే వద్దు, మెరిట్‍లో వస్తే సరి అన్నారు తాతా బామ్మ.

రమణ సుమిత్ర ఆలోచించారు. తాము పెద్దలు చెప్పినట్లు విన్నారు. పిల్లల ఇష్టానికి వదిలేసి సీటు వస్తే చేరుస్తామని అన్నారు. కష్టపడి చదివి సీటు తెచ్చుకుని మెడిసిన్‍లో చేరింది చక్రిక. చిన్నవాడు మాత్రం మంచి ఆర్టిస్ట్‌గా ఎదిగాడు, ఒక బ్యాంక్ జాబ్‌లో చేరాడు. మొత్తానికి పిల్లలు ఎవరి ఇష్టానికి వాళ్ళని చదివించగలిగాడు రమణ. తాను ఒక్కడే కొడుకుని కాబట్టి, తల్లి తండ్రినీ చూసుకోలని తను ఆదే ఊరి కాలేజిలో గడిపాడు, మార్పు సహజం పిల్లల ఇష్ట ప్రకారం – పెద్దవాళ్ళు వద్దు అన్నా – ఒప్పించే చదివించాడు. ఈ తరంలో ఈ మార్పు తప్పదు. పాత ఇల్లు అంతా రీమోడలింగ్ చేయించాడు. సుమిత్రకి, తనకి వయస్సు వస్తోంది. ఇల్లు సదుపాయం లేనిదే చాకిరీ కుదరదు. పని వాళ్ళు ఒక సారి వస్తారు, రాక పోతారు. అంతా పని చెయ్యడం కష్టం. భార్య సుఖం పట్టిచుకోవాలి. డబ్బు ఖర్చు అంటే ఎలా? అమ్మ ముందు వద్దు అన్నా సరే, తల్లి పిల్లలు కూడా ఇల్లు మార్చాలి అన్నారు.

మంచి పిల్లలను ఇంటికి ఇవ్వాలంటే మంచి ఇల్లుగా ఉండాలి. ఈ తరం పిల్లలు అన్ని సుఖాలు లేనిదే పెళ్లికి ఒప్పుకొరు. కారణం పిల్లలకి ఇప్పుడు ఏసీలు, పెద్ద టివిలు, ఫ్రిజ్‌లు, కార్లు ఉండాలి. లేకపోతే ఒప్పుకోరు. అవే కాదు పిల్లని చేసుకోవడానికి కూడా హంగులు ఉండాలి. ఇంకా పిల్లను చేయాలని అంటే ఎన్నో ఆధునిక హంగులు కావాలి అని పిల్లలు అన్నారు.

“అవును చక్రిక పెళ్లి ముందు చేద్దాము” అన్నారు కొడుకులు.

“సరే మీకు ఉద్యోగాలు కనుక మీరు ఎలాగో వేరే ఊళ్ళో ఉండాలి. అవునా?” అన్నాడు రమణ.

సరే అన్నాడు రమణ పెద్ద కొడుకు. శ్రీనివాస్ ఉద్యోగంలో పెరిగాడు. తనకంటూ ఒక అపార్ట్మెంట్ కొన్నాడు.

“ఓహ్ నీ పెళ్లి ఆయ్యేలోగనే నువ్వు సెటిల్ అయ్యావు” అని సంతోష పడ్డారు తల్లిదండ్రులు.

ఆ కుటుంబంలో సుమిత్ర పెంపకంలో పిల్లలు అంతా పెద్దలకి గౌరవం ఇస్తూ, వారికి నచ్చిన మార్గంలో భవిష్యత్ ఎంచుకున్నారు.

చక్రిక పెళ్లి నిశ్చయం బామ్మ తాత ఇష్ట ప్రకారమే జరిగింది. ‘పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు’ అని గట్టి మేళంలో శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తన వినిపించింది. అందరూ సంతోషించారు.

చక్రిక పెళ్లి డెబ్బయి యోగాలు తెలుసున్న కుటుంబంలో డాక్టర్ చదివిన కుర్రాడికి చేశారు. ఇదంతా సుమిత్ర రమణ తెలివి. అటు తల్లి తండ్రి మాట జవదాటకుండా పిల్లల అభీష్టం మేరకు చదివించి పెళ్లి చేశారు. అదే అందరికీ తృప్తి కూడా.

బామ్మ తాత కూడా చాలా సంతోషించారు. బామ్మ మెడలో గొలుసు మనమడు మెడలో వేసింది.

అమ్మ “బామ్మ ప్రేమ నీకు దక్కింది నాకు అదే చాలు” అన్నది. ఆ ముసలి వయస్సులో వాళ్ళ మాట విని చెప్పిన సంబంధం చేసుకున్న చక్రిక ఎంతో ఎత్తు ఎదిగి పోయింది.

ఈ తరం పిల్లలకి నెమ్మదిగా చెప్పి ఒప్పించాలి. అధికారం చలాయిస్తే ఎలా? మారే కాలంతో పాటు పిల్లలని అభీష్టానికి తగ్గట్టుగా పెద్దలు మారి మంచి జీవితం ఇవ్వాలి. అధికారం కాక ఆత్మీయత పంచాలి.

“విదేశాలు వెళ్ళవద్దు, పెళ్లి తరువాత మీ ఇష్టం” అని చక్రికకి చెప్పారు.

అదే విధంగా చక్రిక చాలా మంచి పేరు తెచ్చుకున్నది. సంప్రదాయ కుటుంబంలో పిల్లలు పెద్దల మాటకు ఇప్పటికీ విలువనిస్తున్నారు.

శాంతి శుభమ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here