Site icon Sanchika

సుస్వరాల ఆస్వాదనలో..

[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘సుస్వరాల ఆస్వాదనలో..’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]చె[/dropcap]దరని చిరునవ్వుల సాక్షిగా
ఆటపాటలతో హుషారైన
సందళ్ళ నడుమ
చిన్నారుల కేరింతలు..
ఆమని రాకకు స్వాగతం పలుకుతూ
కోయిలమ్మల కుహు.. కుహూ.. రాగాలు..
కురుస్తున్న వానలకు
పారుతున్న సెలయేళ్ళు చేస్తున్న
గలగలల చిరు సవ్వళ్ళు..
నయన సుమనోహరమైన
నాట్యంతో ఆకట్టుకుంటున్న
నర్తకి కాలి సిరిమువ్వల నాదాలు..
ఊపిరి లీనమైన పిల్లనగ్రోవి పలికే
అనురాగ గమకాలు..
ఎద వీణను మీటుతున్న
అనుభూతుల సుస్వరాలు ఆలకిస్తున్న హృదయం..
ఆనంద భరితం!

Exit mobile version